Karthika Masam: కార్తీక మాసం ఆరంభం సందర్భంగా గోదావరి నదిలో పుణ్య స్నానాలు చేసేందుకు భక్తులు పోటెత్తారు. రాజమండ్రిలోని అన్ని స్నాన ఘట్టాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కార్తీక మాసాన్ని స్వాగతిస్తూ తెల్లవారుజాము నుంచే రాజమండ్రి పుష్కరఘాట్ లో పుణ్య స్నానాలు ఆచరిస్తూ.. అరటి డొప్పలుపై కార్తీక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. శివాలయాల్లో పార్వతి పరమేశ్వరులకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, కుంకుమ పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు.
Read Also: Tamilnadu Rain: భారీ వర్షాలతో తమిళనాడు అతలాకుతలం.. రెడ్ అలర్ట్ జారీ
ఇక, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా దేవాదాయ శాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది పారిశుధ్య పనులను చేపడుతున్నారు. అలాగే, పోలీసులు గస్తీతో భద్రతా చర్యలు సైతం చేపట్టారు. కార్తీక మాసంలో నెల రోజులు గోదావరి నదిలో స్నానాలు ఆచరించి పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లైతే పాప పరిహారం లభించి పుణ్యఫలం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం.
