Site icon NTV Telugu

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద…

శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతుంది. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా జలాశయంలో నీరు వచ్చి చేరుతుంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో ఇన్ ఫ్లో 36,207 క్యూసెకులు ఉండగా ఔట్ ఫ్లో మాత్రం 26,839 గా ఉంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885.00 అడుగులు కాగా ప్రస్తుతం 822.70 అడుగులుగా ఉంది. పూర్తిస్దాయి నీటి నిల్వ 215.8070 టిఎంసీలు కాగా ప్రస్తుతం 42.8708 టీఎంసీలు ఉంది. అయితే ప్రస్తుతం ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రం లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. కానీ కుడి గట్టు విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి మాత్రం ప్రారంభం కాలేదు.

Exit mobile version