Site icon NTV Telugu

Train Brakes Fail: కైలాసగిరిలో తృటిలో తప్పిన పెను ప్రమాదం.. టాయ్‌ ట్రైన్‌ బ్రేకులు ఫెయిల్ కావడంతో..

Train Brakes Fail

Train Brakes Fail

Train Brakes Fail: విశాఖపట్నంలో ప్రముఖ పర్యాటక ప్రాంతం కైలాసగిరిలో తృటిలో పెను ప్రమాదం తప్పింది.. పర్యాటకుల కోసం వేసిన టాయ్ ట్రైన్ బ్రేకులు ఫెయిల్ అవడంతో రైలు ఒక్కసారిగా వెనక్కి పరుగు పెట్టింది.. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు పర్యాటకులు.. ఘటన జరిగిన సమయంలో రైలులో సుమారు వంద మందికి పై గానే పర్యాటకులు ఉన్నారు. అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో.. నిర్వాహకులు ఊపిరి పీల్చుకున్నారు. కోట్లాది రూపాయలు అభివృద్ధి కోసం కేటాయిస్తున్నప్పటికి.. నిర్వహణ సరిగ్గా ఉండడం లేదని పర్యాటకులు మండిపడుతున్నారు.. పర్యాటకుల నుండి రుసుములు అంటూ డబ్బులు వసూలు చేస్తూ.. ఇలా అరకొరా ఏర్పాట్లు, రక్షణ, భద్రతను గాలికి వదిలిస్తే ఎలా అని మండిపడుతున్నారు.. కాగా, కైలాసగిరికి ప్రతీ రోజు భారీ సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు.. విశాఖపట్నం వెళ్లిన పర్యాటకులు.. కైలాసగిరికి వెళ్లి.. అక్కడి నుంచి వైజాగ్‌, బీచ్ అందాలు చూడడానికి ఆసక్తి చూపుతారు..

Read Also: CM Chandrababu: జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు సమీక్ష..

Exit mobile version