కోటి విద్యలు కూటి కొరకు అన్నారు పెద్దలు. మనిషి బతకడానికి కోటి విద్యలు ఉన్నాయంట. అయితే ఎలా పడితే అలా బతికితే కుదరదు. సమాజంలో కొన్ని రూల్స్.. కొన్ని పద్ధతులు ఉన్నాయి. వాటి ప్రకారం నడుచుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే మాత్రం కటకటాలు లెక్కట్టాల్సి ఉంటుంది. ఇదంతా ఎందుకంటారా? బతుకుదెరువు కోసం ఏకంగా ఓ యువతి నకిలీ ఐఏఎస్ అవతారమెత్తి హల్‌చల్ సృష్టించింది. పాపం పండి పోలీసుల చేతికి చిక్కింది.
ఇది కూడా చదవండి: Minister Lokesh: క్యాన్సర్ చికిత్సలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రితో కలిసి పనిచేయండి..
అమృత భాగ్య రేఖ అనే యువతి ఏకంగా ట్రైన్ ఐఏఎస్ అవతారమెత్తింది. విశాఖలో ట్రైనీ ఐఏఎస్ నంటూ కిలాడీ లేడి హల్‌చల్ సృష్టిస్తోంది. అయితే విశాఖ పోలీసులు రంగంలోకి దిగి నకిలీ ఐఏఎస్ బండారాన్ని బట్టబయలు చేశారు. అమృత భాగ్య రేఖ నకిలీ ఐఏఎస్ అని విశాఖ సీపీ తెలిపారు. డీసీపీ ఆధ్వర్యంలో నకిలీ ఐఏఎస్ కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయని తెలిపారు. పోలీసులు రంగంలోకి దిగినట్లు తెలియడంతో కిలాడీ లేడి విశాఖ నుంచి విజయనగరం పారిపోయినట్లుగా సమాచారం. ఆమె కోసం గాలింపు కొనసాగుతోంది.