Site icon NTV Telugu

Earth Quake: విశాఖలో భూ ప్రకంపనలు.. బయటకు పరుగులు తీసిన జనం..

Vsp

Vsp

Earth Quake: విశాఖపట్నం నగరంలో పలు చోట్ల భూ ప్రకంపనలు సంభవించాయి. ఉదయం 4:16 నుంచి 4: 20 నిమిషాల మధ్య వచ్చినట్లు జనం గుర్తించారు. తెల్లవారు జామున కావడంతో కొద్ది మంది మాత్రమే ప్రకంపనలు వచ్చినట్లు పేర్కొన్నారు. మురళీ నగర్, రాంనగర్, అక్కయ్య పాలెం సహా పాలు ప్రాంతాల్లో ఈ భూ ప్రకంపనలు కంపించాయి. దీంతో ఒక్కసారిగా భయంతో పలు కాలనీలకు చెందిన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

Read Also: Koti Deepotsavam 2025: కైలాసాన్ని తలపిస్తున్న వేదిక.. నేడు విశేష కార్యక్రమాలు ఇవే..

కాగా, అల్లూరి సీతారామరాజు జిల్లా G. మాడుగులలో భూకంప కేంద్రాన్ని అధికారులు గుర్తించారు. ఇక, విశాఖపట్నంలో సంభవించిన భూకంపం రిక్టర్ స్కేల్ పై 3.7గాప నమోదు అయింది. భూమి లోపల 10 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చినట్లు తెలుస్తుంది. దీని ప్రభావంతో విశాఖలోని పలు ప్రాంతాలలో భూ ప్రకంపనలు కంపించాయి.

Exit mobile version