Site icon NTV Telugu

Cold Waves In Vizag: విశాఖను గజగజ వణికిస్తున్న కోల్డ్ వేవ్స్..

Vizag

Vizag

Cold Waves In Vizag: సాగర నగరం విశాఖపట్నాన్ని కోల్డ్ వేవ్స్ గజగజ వణికిస్తున్నాయి. నగరంలోని పలు చోట్ల మంచు వర్షంలా కురుస్తుంది. ఉదయం 6 గంటలకే రోడ్డు ఎక్కాల్సిన వాకర్స్ చలి తీవ్రతకు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. దీంతో వాకింగ్ ట్రాక్లు ఖాళీగా దర్శనం ఇస్తున్నాయి. ఏజెన్సీకి ఏమాత్రం తీసుపోకుండా మంచు దట్టంగా కురుస్తుంది. గత కొద్దిరోజుల నుంచి దారుణంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలకు ఇళ్ల నుండి బయటికి రావాలంటేనే చిన్నారులు, వృద్ధులు బెంబేలెత్తిపోతున్నారు.

Read Also: India T20 World Cup Squad: టీం నుంచి గిల్, జితేష్ ఔట్.. టీమిండియాకు నష్టమా లేదా వ్యూహాత్మకమా?

అయితే, కొండవాలు ప్రాంతాలు, నగర శివారులో, రూరల్ ప్రాంతాలు అనే తేడా లేకుండా శీతల గాలులు ప్రజలను వణికిస్తున్నాయి. పొగ మంచు కారణంగా ఉదయం 7 గంటలైనా వాహనదారులు లైట్ల వెలుతురులోనే ప్రయాణిస్తున్నారు. మరో రెండు మూడు వారాల వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

Exit mobile version