Site icon NTV Telugu

Vikram Reddy: బీజేపీ ఉనికి లేదు.. నా గెలుపే నిదర్శనం

Vikram Nlr

Vikram Nlr

ఏపీలో తమ ఉనికిని చాటుకుంటామని బీజేపీ నేతలు గతంలో ప్రకటించారు. అయితే ఆత్మకూరు ఎన్నికల్లో వైసీపీ ధాటికి బీజేపీ నేతలు నిలబడలేకపోయారు. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మరణంతో అనివార్యం అయిన ఆత్మకూరు ఉప ఎన్నికలో వైసీపీ ఘన విజయం సాధించింది. ఆత్మకూరు ఉప ఎన్నికలో వైస్సార్‌సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి భారీ మెజార్టీ విజయాన్ని అందుకున్న అనంతరం ఆయన మాట్లాడారు. నన్ను గెలిపించిన ఆత్మకూరు ప్రజలకు కృతజ్ఞతలు. మా కుటుంబంపై నమ్మకం ఉంచినందుకు ధన్యావాదాలు. గౌతమ్‌ అన్న పేరు నిలబెడతాను. ఇప్పుడు నాపై మరింత బాధ్యత పెరిగింది. ఎన్నికలు పారదర్శకంగా జరిగాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలే నా గెలుపునకు కారణం అన్నారు.

రాజకీయాలకు కొత్త అయిన విక్రమ్ రెడ్డి తన అన్న బాటలో నడుస్తానన్నారు. మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ఉద్వేగానికి లోనయ్యారు. ఆత్మకూరు ప్రజలకు కృతజ్ఞతలు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పట్ల ప్రజలకు ఉన్న ఆదరణ తగ్గలేదు. సీఎం జగన్‌ అమలుచేస్తున్న నవరత్నాలే విజయానికి కారణం. రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. ఆంధ్ర​ప్రదేశ్‌లో బీజేపీకి ఉనికి లేదు. రాష్ట్రానికి బీజేపీ తీవ్ర అన్యాయం చేసింది. కేంద్రం ఇచ్చిన వాగ్దానాలను మరిచిపోయింది. ఏపీకి కేంద్రం సహకారం అందించి ఉంటే ఎంతో మేటు జరిగేది. చంద్రబాబుని రాష్ట్ర ప్రజలు నమ్మరు. భవిష్యత్తులో చంద్రబాబు అధికారంలోకి రావడం కలలో మాటే అన్నారు.

ఆత్మకూరు ఉప ఎన్నికలో బీజేపీ భారీగా ఓట్లు పడతాయని భావించింది. డిపాజిట్ కూడా కోల్పోయింది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డికి 1,02,240 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థి భరత్‌కుమార్‌కు 19,352 ఓట్లు వచ్చాయి. మేకపాటి విక్రమ్‌రెడ్డి, బీజేపీ నుంచి భరత్‌కుమార్‌ యాదవ్‌ సహా మొత్తం 14 మంది అభ్యర్థులు పోటీ చేశారు. నోటా ఓట్లు కూడా ఈసారి బాగానే పోలయ్యాయి. ఈసారి ఆత్మకూరులో బీఎస్పీ అభ్యర్థి నందా ఓబులేశుకు 4897 ఓట్లు రాగా, నోటా కు మాత్రం 4179 ఓట్లు రావడం విశేషం. ఇండిపెండెంట్ల కంటే నోటాకు ఎక్కువ ఓట్లు వచ్చాయి. నోటాకు మొత్తం ఓట్లలో 3.05 ఓట్లు పోలయ్యాయి.

Sajid Mir: ముంబయి పేలుళ్ల సూత్రధారి సాజిద్ మీర్‌కు 15 ఏళ్లు జైలు శిక్ష

Exit mobile version