Site icon NTV Telugu

Minister Narayana: నాలాల ఆక్రమణలను తొలగిస్తాం.. బాధితులకు టిడ్కో ఇళ్లు ఇస్తాం..

Narayana

Narayana

Minister Narayana: విజయవాడలో పబ్లిక్ హెల్త్ ఇంజినీర్ ఇన్ చీఫ్ ప్రభాకర్, వీఎంసీ ఇంజినీర్లు, స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి మంత్రి నారాయణ పర్యటించారు. నగరంలో అవుట్ ఫాల్ డ్రైన్లు, ఇతర డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ శాఖ మంత్రి మాట్లాడుతూ.. 5 వందల కోట్ల రూపాయలతో పనులను 2014- 2019 మధ్య ప్రారంభించాం.. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పనులు నిలిపేసింది అని ఆయన ఆరోపించారు.

Read Also: Gandikota Murder Case: మిస్టరీగానే గండికోట మైనర్ బాలిక హత్య కేసు.. ఎస్పీ ఏం చెప్పారంటే..?

ఇక, 30 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని గతంలో పనులు ప్రారంభించామని మంత్రి నారాయణ తెలిపారు. డ్రైన్స్ కి అడ్డంగా నిర్మించిన ఇళ్లు తొలగించి.. టిడ్కో ఇళ్లు ఇచ్చేటట్లు ప్రణాళికలు రూపొందిస్తున్నాం.. ఆగస్టు నెలలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తాం.. ఆరు నెలల్లో డ్రైన్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం అని వెల్లడించారు. కొంతమంది డ్రైన్లు పూడ్చి ప్రహరీ గోడలు నిర్మించారు.. వాటిని తొలగించాలి అని సూచించారు. బుడమేరు వాగు ఆక్రమాణల తొలగింపుకు తగిన చర్యలు తీసుకుంటామని పొంగూరు నారాయణ పేర్కొన్నారు.

Exit mobile version