Site icon NTV Telugu

Janga Krishnamurthy Resigns: అందుకే టీటీడీ పాలక మండలికి రాజీనామా.. జంగా కృష్ణమూర్తి ఆసక్తికర వ్యాఖ్యలు

Janga Krishnamurthy

Janga Krishnamurthy

Janga Krishnamurthy Resigns: టీటీడీ పాలక మండలి సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి రాజీనామా చేయడం హాట్‌ టాపిక్‌గా మారింది.. తిరుమల స్థల వివాదంలో మనస్తాపానికి గురైన ఆయన రాజీనామా చేశారు.. తన రాజీనామా లేఖను సీఎం చంద్రబాబు, టీటీడీ చైర్మన్‌కు పంపించారు.. ఇక, రాజీనామా అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన జంగా కృష్ణమూర్తి.. మూడోసారి వెంకటేశ్వర స్వామి వారికి సేవ చేసే అవకాశం చంద్రబాబు కల్పించారు.. దీనికి సీఎం చంద్రబాబుకు రుణపడి ఉంటాను అన్నారు.. అయితే, నాపై అనేక ఆరోపణలు చేస్తూ నా వ్యక్తిగత హననానికి పాల్పడుతున్నారు.. దీనివల్ల నేను కలత చెంది ఆవేదనగా ఉన్నాను.. నా వల్ల సీఎం చంద్రబాబుకు ఇబ్బంది కలగకుండా ఉండాలని బోర్డు సభ్యుడిగా రాజీనామా చేస్తున్నాను అని ప్రకటించారు.. రాజీనామా పత్రాన్ని సీఎం చంద్రబాబుకి, టీటీడీ బోర్డు చైర్మన్ కు పంపాను అని వెల్లడించారు..

గతంలోనే నాకు స్థలం కేటాయింపు జరిగినా నా దగ్గర డబ్బులు లేక చెల్లించలేదు.. దీంతో హైకోర్టుకు వెళ్లాను అని గుర్తు చేసుకున్నారు జంగా.. వైసీపీ సమయంలో కేటాయింపు చేయాలని రిక్వెస్ట్ చేశాను.. కొండపై నా పేరుతో స్థలం ఉండాలని నేను ట్రస్ట్ ఏర్పాటు చేశాను.. అక్కడ ఏది నిర్మాణం చేసినా ఆలయం పరిధిలోనే ఉంటుంది.. మేం ఎంత చెల్లించి నిర్మాణాలు చేసినా అవి స్వామి వారికి చెందుతాయి.. వ్యక్తిగతంగా సంక్రమించవు అని పేర్కొన్నారు. గతంలో నాకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా రిజెక్ట్ చేశారు.. అప్పుడు నేను సీఎం దృష్టికి పంపగా బోర్డుకు వెళ్లింది.. బోర్డు అనుమతి ఇచ్చిన తర్వాత మళ్లీ ఇదంతా జరుగుతోంది.. కొన్ని శక్తులు ఇదంతా చేస్తున్నాయి అంటూ ఆరోపణలు గుప్పించారు.. బలహీన వర్గాలకు చెందిన నేను దైవ సేవ చేయటం కోసం ప్రయత్నిస్తే ఇలా చేస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు.. నేను ఈ స్థాయికి రావటానికి కుల సపోర్ట్, రాజకీయ కుటుంబం కాదు.. సొంతంగా ఎదిగాను అన్నారు.. నేను టీటీడీనీ అపవిత్రం చేస్తున్నానని లబ్ది కోసం ఇదంతా చేస్తున్నానని ఆరోపణలు చేస్తున్నారు అని మండిపడ్డారు.

ఇక, బోర్డ్ అనుమతి ఇచ్చిన తర్వాత ఇదంతా చేస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు జంగా కృష్ణమూర్తి.. కేబినెట్‌ లో చర్చ జరిగిందో లేదో నాకు తెలియదు.. కానీ చర్చ జరిగినట్టు నాపై రాతలు రాస్తున్నారు అని పేర్కొన్నారు.. టీటీడీ సభ్యుడు భాను ప్రకాశ్ రెడ్డి మాత్రమే వ్యతిరేకించారు.. సభ్యులు వ్యతిరేకించటం సాధారణం.. కానీ, మెజార్టీ సభ్యులు మాత్రం కేటాయింపు ఆమోదం తెలిపారని గుర్తు చేవారు.. అయితే, నా వల్ల ప్రభుత్వం పై, బోర్డుపై అపవాదాలు రాకుండా ఉండటానికే రాజీనామా చేశాను అని క్లారిటీ ఇచ్చారు.. ధర్మారెడ్డి సమయంలో లాండ్ నాకు కేటాయించారు.. ఆయన అధర్మారెడ్డి.. కొండపై స్థలాలు కూడా రియల్ ఎస్టేట్ మాదిరి వేలం పాటలు పెట్టారు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. అప్పట్లో నేను ప్రశ్నిస్తే ధర్మారెడ్డి నాకు స్థలం రాకుండా ఆపారు.. నాకు ఈ బోర్డును స్థలం కేటాయింపు చేయమని అడగలేదు.. రీ అలాటు మెంట్ చేయమని కోరాను.. రిజెక్ట్ చేసినా నేను బాధపడే వాడిని కాదు.. కానీ, నా పై అసత్య ప్రచారం చేయటం బాధ కలిగింది.. దీని వెనుక కుట్ర జరిగి ఉండచ్చు అని పేర్కొన్నారు..

బోర్డ్ మొత్తాన్ని అపవిత్రం చేస్తున్నారు కాబట్టి బోర్డు సభ్యత్వానికి రాజీనామా చేశాను… టీటీడీ నూతన బోర్డు ఏర్పాటు అయ్యాక అనేక మార్పులు వచ్చాయి, మంచి పేరు ఉంది.. ఆ పేరు నా వల్ల పోకూడదు అనేది నా ఉద్దేశం అన్నారు జంగా కృష్ణమూర్తి.. ట్రస్ట్ పేరుతో స్థలం ఇవ్వాలని కోరాను, ట్రస్ట్ చైర్మన్ గా నేను ఉన్నాను.. నేను 60 లక్షలు డబ్బులు కట్టాను.. నేను YCP నుంచి టీడీపీలో చేరతాను అని తెలిసి డబ్బులు వెనక్కి ఇచ్చి రద్దు చేశారు అని పేర్కొన్నారు జంగా కృష్ణమూర్తి..

Exit mobile version