Site icon NTV Telugu

Vijayasai Reddy: సిట్‌ విచారణకు విజయసాయిరెడ్డి హాజరుపై సస్పెన్స్‌..! అధికారులకు మాజీ ఎంపీ సమాచారం

Vijayasai Reddy

Vijayasai Reddy

Vijayasai Reddy: ఆంధ్రప్రదేశ్‌ లిక్కర్ స్కామ్‌ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్‌) ముందు మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి హాజరుపై సస్పెన్స్‌ కొనసాగుతోనే ఉంది.. తాజా నోటీసుల ప్రకారం.. సిట్‌ ముందు నేడు విజయసాయిరెడ్డి హాజరుకావాల్సి ఉండగా.. తనకు ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలు ఉండటం కారణంగా ఇవాళ విచారణకు రాలేనని విజయసాయి రెడ్డి సిట్ అధికారులకు తెలిపారు. తాను ఎపుడు విచారణకు వచ్చే తేదీని తెలియచేస్తానని విజయ సాయిరెడ్డి సిట్ కు చెప్పారు. ఇప్పటికే రెండు సార్లు సిట్ ముందు విచారణకు విజయ సాయి రెడ్డి హాజర య్యారు. చార్జిషీట్ దాఖలు చేయాల్సి ఉన్నందున విచారణకు రావాలని సిట్ స్పష్టం చేసింది. దీంతో, విజయ సాయి రెడ్డి సిట్ విచారణకు హాజరు అవుతారా? లేదా? అనే సస్పెన్స్ కొనసాగుతోంది. మరోవైపు, లిక్కర్‌ కేసులో విజయసాయిరెడ్డి.. సిట్‌ ముందు హాజరైన తర్వాతే.. సిట్‌ మరింత దూకుడు పెంచింది.. కేసులు నమోదు చేసింది.. పలువురు కీలక వ్యక్తులను అరెస్ట్‌ చేసింది.. ఈ నేపథ్యంలో మరోసారి సాయిరెడ్డి సిట్‌ ముందుకు వస్తే.. ఎలాంటి విషయాలు వెల్లడిస్తారు.. ఈ కేసు ఎలాంటి మలుపు తీసుకోనుంది అనేది ఉత్కంఠగా మారింది..

Read Also: Shankar : శంకర్ కొత్త ప్రాజెక్ట్ .. మాకు నమ్మకం లేదు దొర అంటున్న నెటిజన్స్

మరోవైపు, ఈ రోజు ఎక్స్ (ట్విట్టర్‌)లో మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు.. భగవద్గీత శ్లోకాన్ని ఎక్స్ లో పోస్ట్‌ చేసిన ఆయన.. “विपक्ष सहित सभी राजनीतिक दलों को राज-धर्म का पालन करना चाहिए। కర్మణ్యే వాధికారస్తే మాఫలేషు కదాచన!.. మా కర్మఫలహేతుర్భూ: మా తేసంగోஉస్త్వకర్మణి!!”.. “కర్మలను ఆచరించుట యండే నీకు అధికారము కలదు.. కానీ, వాని ఫలితముల మీద లేదు. నీవు కర్మఫలములకు కారణం కారాదు. అట్లని కర్మలను చేయుట మానరాదు-శ్రీ శ్రీ భగవద్గీత.” అంటూ భగవద్గీత శ్లోకాన్ని తన ఎక్స్ ఖాతాలో ఆసక్తికరమైన పోస్టు పెట్టిన విషయం విదితమే..

Exit mobile version