Site icon NTV Telugu

Vijayawada Drugs Case: బెజవాడ డ్రగ్స్ కేసులో ట్విస్ట్‌.. బెంగళూరు యువతి ఎంట్రీతో..!

Drugs

Drugs

Vijayawada Drugs Case: బెజవాడ డ్రగ్స్ కేసులో కొత్త ట్విస్ట్‌ వచ్చి చేరింది.. కొత్త సంవత్సరం వేడుకల వేళ బెజవాడలో వెలుగుచూసిన MDMA డ్రగ్స్ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో తాజాగా కీలక మలుపు చోటుచేసుకుంది. బెంగళూరుకు చెందిన వేములపల్లి గ్రీష్మ అనే యువతిని పోలీసులు నిందితురాలిగా చేర్చడంతో వ్యవహారం మరింత ఉత్కంఠగా మారింది. న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌ సందర్భంగా MDMA డ్రగ్స్‌ను తీసుకుని విజయవాడకు వచ్చిన ఏ4 నిందితుడు మహేష్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. గాయత్రి నగర్‌ సమీపంలోని ఓ పబ్‌కు వెళ్తుండగా మహేష్‌ను అదుపులోకి తీసుకున్నట్టు అధికారులు వెల్లడించారు.

Read Also: The Raja Saab: ప్రభాస్‌ను వదిలే ప్రసక్తే లేదు.. ముగ్గురు భామల మధ్య డార్లింగ్‌ను ఆడేసుకోనున్న వంగా!

విచారణలో మహేష్ రెడ్డి సంచలన విషయాలు బయటపెట్టాడు. బెంగళూరులో వేములపల్లి గ్రీష్మ వద్ద అతడు డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. మహేష్‌తో పాటు అతని స్నేహితులకు కూడా గ్రీష్మ గత కొన్నాళ్లుగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు దర్యాప్తులో తేలింది. మహేష్ ఫోన్ ద్వారా గ్రీష్మకు చేసిన డిజిటల్‌ పేమెంట్స్‌ స్క్రీన్‌షాట్లు, ట్రాన్సాక్షన్‌ డేటాను పోలీసులు కీలక ఆధారాలుగా సేకరించారు. దీని ఆధారంగా మహేష్, అతని స్నేహితులకు గ్రీష్మ రెగ్యులర్‌గా డ్రగ్స్ అమ్ముతున్నట్టు నిర్ధారించినట్టు అధికారులు తెలిపారు. అయితే, కేసులో పేరు చేర్చినప్పటి నుంచి గ్రీష్మ పరారీలో ఉంది. ఆమె కోసం ప్రత్యేక పోలీసు బృందాన్ని బెంగళూరుకు పంపినట్టు విజయవాడ పోలీసులు ప్రకటించారు. గ్రీష్మను పట్టుకుని విచారణకు తీసుకొచ్చిన తర్వాతే డ్రగ్స్ నెట్‌వర్క్‌కు సంబంధించిన మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

Exit mobile version