APSRTC Special Buses: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ప్రజల ముఖ్య పండుగల్లో దసరా ఒకటి. దుర్గమ్మ ఆలయాలకు వచ్చి వెళ్ళే భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. ఏపీలో నలుమూల నుండి ప్రయాణికులు ఎక్కువగా ప్రయాణం సాగిస్తారు. హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై వంటి అంతరాష్ట్ర నగరాల నుండి వచ్చే ప్రయాణికులకు కూడా ఎటువంటి ఆటంకం కలగకుండా ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించింది. విజయవాడ నుండి రాష్ట్రంలోని అన్ని ఇతర ప్రాంతాలకు తిరిగే బస్సులను యథావిథిగా నడుపుతుంది. వివిధ జిల్లాలకు, ముఖ్య పట్టణాలకు, నగరాలకు కూడా ఇబ్బంది లేకుండా ప్రయాణికులను చేరవేస్తుంది. ఈ నెల 4 నుండి 20 వరకు మొత్తం 6,100 బస్సులు నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.
Read Also: Screen Time Tips: మొబైల్ స్క్రీన్ టైమ్ తగ్గించుకోవాలా?.. ఈ టెక్ టిప్ మీకోసమే!
పండుగ రోజులలో అదనంగా హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు వంటి పొరుగు రాష్ట్రాలకు, 6,100 ప్రత్యేక బస్సులు నడుపుతారు. ఈ నెల 4 నుంచి 11 వరకూ 3,040 బస్సులు, 12 నుంచీ 20 వరకూ 3,060 బస్సులు నడుస్తాయి. హైదరాబాద్ నుండి 990 బస్సులు, బెంగుళూరు నుండి 275 బస్సులు, చెన్నై నుండి 65 బస్సులు పలు పట్టణాలకు రన్ చేస్తారు. విశాఖపట్నం నుండి 320 బస్సులు, రాజమండ్రి నుండి 260 బస్సులు, విజయవాడ నుండి 400 బస్సులు, ఇతర జిల్లాల నుండి వివిధ ప్రాంతాలకు 730 ప్రత్యేక బస్సుల కేటాయింపుతో రద్దీని తట్టుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. దసరా తరువాత హైదరాబాద్ నుండి 990 బస్సులు, బెంగుళూరు నుండి 330 బస్సులు, చెన్నై నుండి 70 బస్సులు తిప్పుతారు. ప్రయాణికులపై భారం మోపొద్దన్న లక్ష్యంతో… సాధారణ ఛార్జీలతోనే ఈ ప్రత్యేక బస్సులు తిప్పుతారు. ఏపీఎస్ఆర్టీసీలో కొత్తగా ప్రవేశ పెట్టిన UTS మెషీన్లతో చిల్లర సమస్యకు చెక్ పెట్టారు. ఫోన్ పే, గూగుల్ పే, QR కోడ్ స్కాన్ చేసి క్రెడిట్, డెబిట్ కార్డుల స్వైపింగ్ ద్వారా కూడా టిక్కెట్లు తీసుకుని ప్రయాణం సాగించే వీలుంది. ముందస్తుగా సీటు వివరాలు చెక్ చేసుకుని బస్సులను ఎంచుకునే అవకాశం కూడా ఉండడంతో ఈసారి ప్రయాణీకులకు మరింత సేవలు అందించడానికి ఏపీఎస్ఆర్టీసీ కృషి చేస్తుంది.
Read Also: Team India: మంచి ‘బలగం’ ఉంది.. మరో పదేళ్లు ఢోకా లేదు: వీవీఎస్ లక్ష్మణ్
దసరాకు 3 వేల 40 ప్రత్యేక బస్సులను నడపనుంది ఏపీఎస్‌ఆర్టీసీ. అక్టోబర్ 4 నుంచి 11 మధ్య హైదరాబాద్, చెన్నై, బెంగళూరుతో పాటు.. ఏపీలోని ముఖ్య ప్రాంతాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు నడిపిస్తోంది. హైదరాబాద్ నుంచి 990, బెంగళూరు నుంచి 275, చెన్నై 65, విశాఖ 320, రాజమండ్రి నుంచి 260, విజయవాడ నుంచి 440 ప్రత్యేక బస్సులు నడిపించనుంది. ఏపీలోని జిల్లాల మధ్య మరో 730 దసరా ప్రత్యేక బస్సులు నడిపిస్తామని ఆర్టీసీ ప్రకటించింది. ఇక…దసరా తర్వాత 12 నుంచి 20 తేదీల మధ్య 3 వేల 60 APSRTC స్పెషల్ బస్సులు వివిధ రూట్లలో తిప్పనుంది ఆర్టీసీ. ఐతే…సాధారణ ఛార్జీలతోనే APSRTC దసరా ప్రత్యేక బస్సులు నడుస్తాయని తెలిపారు అధికారులు.