Site icon NTV Telugu

Vijayawada to Kuwait Flight: గుడ్‌న్యూస్‌.. గన్నవరం నుంచి కువైట్‌కు నేరుగా విమానం

Flight

Flight

Vijayawada to Kuwait Flight: ఆంధ్రప్రదేశ్‌లోని విదేశీ ప్రయాణికులు.. అన్ని ప్రాంతాలకు నేరుగా వెళ్లేందుకు విమాన సౌకర్యం లేదు.. వాళ్లు హైదరాబాద్‌ లేదా మరో సిటీకో వెళ్లి విదేశీయానం చేయాల్సి ఉంటుంది.. అయితే, గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి క్రమంగా అంతర్జాతీయ విమానాలు ప్రారంభం అవుతున్నాయి.. ఇవాళ్టి నుంచి కువైట్ విమాన సర్వీసులు పునర్‌ప్రారంభం కాబోతున్నాయి. నేటి నుండి గన్నవరం-కువైట్ విమాన సర్వీసు ప్రారంభం కానుంది.. విజయవాడ నుండి నేరుగా కువైట్ కు విమాన సర్వీసు నేటి నుండి అందుబాటులోకి తీసుకువస్తుంది ఎయిరిండియా.. ప్రతి బుధవారం గన్నవరం నుండి కువైట్‌కు విమానం బయల్దేరనుంది.. నేటి నుండి అక్టోబర్ 28వ తేదీ వరకు ఈ సర్వీసును కొనసాగించనున్నారు..

Read Also: Astrology : మార్చి 29, బుధవారం దినఫలాలు

వందేభారత్‌ మిషన్‌ను కేంద్రం ఉపసంహరించుకోవటంతో ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌కు అత్యంత ఆదరణ ఉన్న దేశాలకు విజయవాడ నుంచి నేరుగా అంతర్జాతీయ విమాన సర్వీసులను ప్రారంభిస్తుంది.. విజయవాడ నుంచి షార్జాకు ఇటీవలే తొలి అంతర్జాతీయ సర్వీసు ప్రారంభం అయ్యింది.. దీంతో షార్జాకు రెండు సర్వీసులు వెళ్తున్నాయి.. ఇక ఇప్పుడు విజయవాడ నుంచి కువైట్‌కు రెగ్యులర్‌ విమాన సర్వీసును ప్రారంభిస్తోంది. ఈ విమానం తిరుచిరాపల్లి నుంచి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు రానుండగా.. ఇక్కడి నుంచి నేరుగా కువైట్‌ వెళ్తుంది.. 180 సీటింగ్‌ కెపాసిటీతో ఈ విమానం నడనుంది.. ప్రతి బుధవారం ఉదయం 9.55 గంటలకు విజయవాడలో బయలుదేరి మధ్యాహ్నం 2.40 గంటలకు కువైట్‌ చేరుకోనుంది.. ఇక, కువైట్‌లో సాయంత్రం 3.40 గంటలకు బయలుదేరి రాత్రి 8.35 గంటలకు తిరిగి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ చేరుకోనుంది ఎయిరిండియా విమానం. దీంతో.. కువైట్ నుంచి ఏపీకి రాకపోకలు సాగించే ప్రయాణికులకు ఇబ్బందులు తొలగిపోనున్నాయి.

Exit mobile version