NTV Telugu Site icon

విజ‌య‌వాడ‌కు వంగ‌వీటి రంగా పేరు పెట్టాల్సిందే.. చిరంజీవి, ప‌వ‌న్ స్పందించాలి..

ఏపీలో కొత్త జిల్లా ఏర్పాటు వ్య‌వ‌హారం కొన్ని ప్రాంతాల్లో కాక‌రేపుతోంది.. జిల్లాల పేర్ల‌పై అభ్యంత‌రాలు వ్య‌క్తం అవుతున్నాయి.. జిల్లా కేంద్రాల‌ను కూడా మార్చాల‌నే డిమాండ్ వినిపిస్తోంది.. ఇక‌, విజయవాడకు వంగవీటి రంగా పేరు పెట్టాల‌నే డిమాండ్ తెర‌పైకి వ‌చ్చింది.. విశాఖ‌లో మీడియాతో మాట్లాడిన వంగ‌వీటి రాధ, రంగా రీ ఆర్గనైజషన్ సభ్యులు గాదె బాలాజీ… బెజ‌వాడ‌కు వంగ‌వీటి రంగా పేరు పెట్టాల‌ని సీఎం వైఎస్ జ‌గ‌న్‌ను కోరారు.. ఈ విష‌యంపై చిరంజీవి, పవన్ క‌ల్యాణ్ కూడా స్పందించాల‌ని కోరారు.. విజయవాడ ప్రజలకు వంగవీటి రంగా ఎనలేని సేవలు చేశార‌ని గుర్తు చేసిన ఆయ‌న‌.. అందుకే ఆయ‌న పేరు పెట్ట‌డ‌మే స‌రైంది అంటున్నారు.

Read Also: అమ‌ర జ‌వాన్ జ్యోతికి రాహుల్ గాంధీ భూమి పూజ‌

మ‌రోవైపు, అనకాపల్లికి కూడా గుడివాడ గురునాథ్ పేరు పెట్టాల‌ని కోరారు గాదె బాలాజీ.. ఇక‌, వంగ‌వీటి రంగా కాపుల కోసం ఎనలేని సేవలు చేశార‌ని.. కనీసం జిల్లాకు ఆయన పేరు పెట్టకపోతే పెద్ద పాలేరుగా కూడా ఉండలేం అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.. చిరంజీవి కాపుల కోసం పెద్ద‌న్న‌గా ఉంటామ‌న్నారు.. కచ్చితంగా విజయవాడకు రంగా పేరు పెట్టి తీరాల‌న్న ఆయ‌న‌.. చాలా మంది రంగా పేరు వాడుకుంటున్నారు తప్ప దీనిపై ఎవరు మాట్లాడం లేద‌ని అస‌హ‌నం వ్య‌క్తం చేశారు.. సీఎం జగన్ దగ్గరకి వెళ్లి కేవలం సినిమా విషయాలే కాకుండా ఈ విషయం పై కూడా చిరంజీవి, పవన్ క‌ల్యాణ్ స్పందించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.. బయటకు వచ్చి ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేయాల‌న్నారు.. రాధ మాట్లాడకపోయినా అయన తరుపున మేం మాట్లాడుతున్నాం.. త్వరలో నే ఆయన కూడా వస్తార‌ని.. కాపుల్లో ఐక్యత లేకపోవడం వల్లే ఇలాంటి పరిణామం చోటు చేసుకుంటున్నాయ‌న్నారు. ముద్రగడ పద్మనాభం పశ్చిమ గోదావరి జిల్లాకి అంబేద్కర్ పేరు, ఇతర జిల్లాలకు పేర్లు సూచించారు.. కానీ, కృష్ణ జిల్లాకు మాత్రం వంగవీటి రంగా పేరు సూచించక పోవడం దార‌ణ‌మైన విష‌యం అన్నారు గాదె బాలాజీ.