ఏపీలో కొత్త వైరస్ పై వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే దీనిపై చంద్రబాబుకు చురకలు అంటించారు విజయసాయిరెడ్డి. ” సీసీఎంబీ రిపోర్టు వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు గోబెల్స్ ప్రచారం ఆపడం లేదు. N440K వైరస్ వేరియెంట్ ప్రబలిందంటూ NARA-420 వైరస్ ప్రచారం చేస్తోంది. హైదరాబాద్ పారిపోయినా నారా 420 వైరస్ ఆనవాళ్లు మాత్రం రాష్ట్రంలో అక్కడక్కడా ఉన్నాయి. ప్రజల్ని భయపెట్టడమే పనిగా పెట్టుకుందీ ఈ జూమ్ భూతం.” అంటూ ఎద్దేవా చేశారు విజయసాయిరెడ్డి. ఇక అంతకు ముందు ట్వీట్ లో “14 ఏళ్లు సీఎంగా వెలగబెట్టానని చెప్పుకునే చంద్రబాబు ఏనాడూ వైద్య రంగంలో మౌలిక వసతుల విస్తరణను పట్టించుకోలేదు. అప్పుడే ముందు చూపు కనబర్చి ఉంటే కరోనా మహమ్మారిని ఎదుర్కోవడం తేలికయ్యేది. వైద్యం ప్రభుత్వ బాధ్యతే కాదని చెప్పిన వ్యక్తి ఇప్పుడు గురివింద నీతులు చెబుతున్నాడు. రెండేళ్లుగా జరిగన ప్రతి ఎన్నికల్లో ప్రజలు చిత్తుగా ఓడించి కుళ్లబొడిచినా బాబు ముఠాకు బుద్ధి రాలేదు. రాష్ట్రంలో ఎవరూ ప్రశాంతంగా ఉండకూడదు. పారిపోయి పొరుగు రాష్ట్రంలో తలదాచుకుని అబద్దాల యంత్రాల్లా దుష్ప్రచారాలు సాగిస్తున్నారు. పైశాచికానందం పొందడం మినహా ఏం సాధిస్తారు?” అని విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు.
ఏపీలో కొత్త వైరస్ వివాదం : విజయసాయిరెడ్డి సంచలన ట్వీట్ !
