తెలంగాణ పీసీసీగా రేవంత్ రెడ్డి ఎంపిక కావడంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తనదైన స్టైల్‌లో స్పందించారు. రాహుల్ గాంధీని ‘ఇంప్రెస్’ చేయడానికి ఏం ‘మంత్రం’ వేశాడో గాని టీపీసీసీ అధ్యక్ష పదవికి కొత్త నేతను ఎంపిక చేయకుండా అడ్డుకున్నాడని… అన్ని అడ్డంకులు క్లియర్ చేసి తన మనిషిని పీసీసీ సీట్లో కూర్చోబెట్టాడని చంద్రబాబు చురకలు అంటించారు. టీపీసీసీని… ఇక తెలంగాణ బాబు కాంగ్రెస్ కమిటీ(TBCC) అనాలేమో అని ఎద్దేవా చేశారు. కేసుల నుంచి రక్షణ కోసం నలుగురు ఎంపీలకు బిజెపి తీర్థం ఇప్పించాడని… ‘మనవాళ్లు బ్రీఫుడ్ మీ’ కేసు ఎప్పటికీ తేలకుండా తెలంగాణా పార్టీ అధ్యక్షుడిని గులాబి పార్టీలోకి చొప్పించాడంటూ పేర్కొన్నారు విజయసాయిరెడ్డి.
read also : కేసీఆర్ మనవడు హిమాన్షుకు అవార్డు..
పచ్చ రక్తం నరనరాల్లో ప్రవహించే కరడు కట్టిన ముఖ్యులను ముందుగానే కాంగ్రెస్ లోకి తోలాడని… బాబా మజాకా! పొలిటికల్ బ్రోకర్ చంద్రబాబు విశ్వరూపం ప్రదర్శిస్తున్నాడన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దల్ని కొనిపడేసి తెలంగాణాలో తన శిష్యుడికి పీసీసీ అధ్యక్ష పీఠం ఇప్పించుకున్నాడని వెల్లడిం చారు. కిందటి ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని ఆ పార్టీని భ్రష్టుపట్టించాడని… ఇప్పుడు డైరెక్టుగా తన కంట్రోల్లోకి తెచ్చుకున్నాడని ఎద్దేవా చేశారు.
