Site icon NTV Telugu

Weather Update: తెలుగు రాష్ట్రాల్లో మిక్స్డ్ క్లైమేట్..

Weather

Weather

Weather Update: తెలుగు రాష్ట్రాలలో వాతావరణ అనిశ్చిత నెలకొంది. ఈశాన్య రుతు పవనాలు బలహీనంగా మారాయి. దీంతో ఎండ, వానలతో కూడిన మిక్స్డ్ క్లైమేట్ ఇబ్బంది పెడుతోంది. మొంథా తుఫాన్ తర్వాత తేమ శాతం తగ్గిపోవడంతో పొడి వాతావరణం కొనసాగుతుంది. ఫలితంగా ఎండ తీవ్రత పెరిగింది. అసలు వింటర్ సీజన్లో వున్నామా?.. అనే అనుమానం కలిగే స్థాయిలో ఉక్క పోత ఎక్కువ అయ్యింది. సాధారణం కంటే మూడు డిగ్రీలు కంటే ఎక్కువ పగటి ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీంతో క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడేందుకు వాతావరణం సహకరిస్తోంది.

Read Also: Bigg Boss : అనారోగ్య సమస్యలతో బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన ఆ కంటెస్టెంట్..

మరోవైపు, ఉత్తర భారతదేశంలో వెస్ట్రన్ డిస్రబెన్స్ ఉంది. ఇప్పటికే ఏలూరు, అల్లూరి, అనకాపల్లి సహా పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. అటు, మయన్మా ర్ తీరం దగ్గర ఒక అల్పపీడనం ఏర్పడనుండగా దాని ప్రభావం ఏపీ వైపు వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఈనెల 10వ తేదీ తర్వాత ఈశాన్య రుతు పవనాలు మళ్ళీ యాక్టివేట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

Read Also: Srikakulam: ఛీ..ఛీ.. నువ్వు టీచర్‌వేనా..? విద్యార్థినులతో కాళ్లు పట్టించుకున్న ఉపాధ్యాయురాలు..

ఇక, రేపటి నుంచి తమిళనాడును అనుకుని ఉన్న దక్షిణ కోస్తా, రాయలసీమలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీనికి స్థానిక వాతావరణ పరిస్థితులు కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోసారి వర్షం హెచ్చరికలతో రైతుల్లో కలవరం మొదలైంది. తీవ్ర తుఫాన్ కారణంగా జరిగిన పంట నష్టం కళ్ళ ముందే ఉండగా మళ్ళీ వర్షాల హెచ్చరికలతో భయపడుతున్నారు.

Exit mobile version