NTV Telugu Site icon

ద్వారకా తిరుమలలో ఇద్దరు మహిళల నిరసన

పశ్చిమగోదావరి జిల్లాలో వెలసిన చిన్నతిరుపతిలో ఇద్దరు మహిళల నిరసన చర్చనీయాంశం అయింది. ద్వారకాతిరుమల ఈవోని కలవడానికి వచ్చిన ఇద్దరు మహిళలు ఆలయ విఐపి లాంజ్ ముందు నిరసన తెలిపారు. వీఐపీ లాంజ్‌ తలుపులు వేసుకొని లోపల ఉన్నారు ఆలయ ఈవో సుబ్బారెడ్డి. అయితే, ఈవోని కలిసేవరకు వెళ్ళమని బైఠాయించిన మహిళలు నినాదాలు చేశారు. వీఐపీ లాంజ్ వద్దకు చేరుకున్న పోలీసులు, టెంపుల్ సెక్యూరిటీ సిబ్బంది వారిని వారించే ప్రయత్నం చేశారు.