Site icon NTV Telugu

Yanam Floods: వరదల ఎఫెక్ట్‌.. అక్కడ నేడు, రేపు స్కూళ్లకు సెలవులు

Yanam

Yanam

వర్షాలు తగ్గుముఖం పట్టాయి.. వరదలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి.. గోదావరిలో వరద ఉధృతి తగ్గినా.. ఇంకా ఆంధ్రప్రదేశ్‌లోని ధవళేశ్వరం బ్యారేజ్‌ దగ్గర మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతూనే ఉంది.. 20 లక్షలకు పైగా క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడిచిపెడుతున్నారు.. అయితే, గోదావరి వరదల ప్రభావం యానాంలో స్పష్టంగా కనిపిస్తోంది.. యానాంను ఇంకా వరదలు వీడడం లేదు.. యానాం పట్టణంలో కొన్ని ప్రాంతాల్లో వరద నీరు ప్రవహిస్తున్న నేపథ్యంలో.. అప్రమత్తమైన అధికారులు.. ముందు జాగ్రత్త చర్యగా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు.. వరదల నేపథ్యంలో.. ఇవాళ, రేపు.. యానాంలోని అన్ని స్కూళ్లను సెలవు ప్రకటించింది విద్యాశాఖ.. యానాం రీజియన్‌లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌, ఎయిడెడ్‌ పాఠశాలకు రెండు రోజుల పాటు సెలువు ఉంటుందంటూ యానాం పరిపాలన అధికారి శర్మ ఆదేశాలు జారీ చేశారు.

Read Also: Schools Are Open From Today: వారం తర్వాత.. నేటి నుంచి స్కూల్స్‌ పునఃప్రారంభం..

కాగా, భారీ వర్షాలు వరదల నేపథ్యంలో.. తెలంగాణలో మూతబడిన విద్యాసంస్థలు నేటి నుంచి తెరుచుకోనున్నాయి.. వాతావరణ శాఖ హెచ్చరికలు నేపథ్యంలో.. మొదట మూడు రోజులు సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం.. వర్షాలు వీడకం పోవడం… క్రమంగా గోదావరిలో వరద ఉధృతి పెరిగిన నేపథ్యంలో మరో మూడు రోజుల పాటు స్కూళ్లకు సెలవులు పొడిగించిన విషయం తెలిసిందే.. దీంతో.. వారం రోజుల పాటు స్కూళ్లు మూతపడ్డాయి.. తిరిగి ఇవాళ్టి నుంచి విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి. మరోవైపు, మరో రెండు రోజులు వర్షాలు తప్పవని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే.

Exit mobile version