Site icon NTV Telugu

Ambanti : తురకపాలెంలో ముప్పై మంది చనిపోవడం బాధాకరం

Untitled Design (6)

Untitled Design (6)

తురకపాలెంలో మూడు నెలల్లో ముప్పై మంది చనిపోవడం బాధాకరమని.. ఈ విషయం సంచలనం సృష్టించిందని మాజీ మంత్రి అంబంటి రాంబాబు అన్నారు..ప్రకాశం జిల్లా, తాళ్ళూరు మండలం లోని ఒక రెవెన్యూయేతర గ్రామం తురకపాలెం. గ్రామాల్లో ప్రజలకు మూడు నెలల నుంచి జ్వరాలు రావడం, ఆసుపత్రిలో చేరడం, చనిపోవడం జరిగిందన్నారు.
పూర్తి వివరాల్లోకి వెళితే….ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేసిన సమావేశంలో అంబంటి రాంబాబు మాట్లాడుతూ.. ప్రకాశం జిల్లాలోని తురుకపాలెంలో మూడు నెలల నుంచి జ్వరాలతో ఆస్పత్రిలో చేరి జనాలు చనిపోతున్నారు. వరుస మరణాలపై ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.ప్రభుత్వంపై వత్తిడి తీసుకురావడంలో భాగంగానే ఇక్కడకు రావడం జరిగింది.వాటర్ పొల్యూషన్ జరిగిందని తమ దగ్గర సమాచారం ఉందన్నారు..గ్రామంలో సంజీవయ్య కుంటలోని నీటిని వాటర్ ట్యాంకు ద్వారా సరఫరా చేస్తున్నారు.నీటిసరఫరా సక్రమంగా జరగడం లేదని ఆరోపించారు. తురకపాలెంలో బోర్లు వేసి గుంటూరులో నీటిని అమ్ముతున్నారన్నారు.

మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆరోగ్య శాఖా మంత్రి ముందే స్పందిచవచ్చు కదా… ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేతులు‌ కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంగా ప్రభుత్వ తీరు ఉందని అంబంటి విమర్శించారు. .

Exit mobile version