చనిపోయిన ఓ యాచకుడి ఇంట్లో రెండు ట్రంకు పెట్టెల్లో భారీగా నగదు చూసి షాక్ తిన్నారు టీటీడీ విజిలెన్స్ అధికారులు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తిరుమల కొండపై భిక్షాటన చేసే శ్రీనివాస్ అనే వ్యక్తిని నిర్వాసితుడిగా భావించి తిరుపతిలో ఇల్లు కేటాయించారు అధికారులు.. అయితే.. ఏడాది కిందట అనారోగ్య సమస్యలతో శ్రీనివాసన్ మృతిచెందాడు.. అతడికి వారుసులు ఎవరూ లేకపోవడంతో.. తిరుపతిలోని శేషాచల కాలనీలో గతంలో కేటాయించిన రూమ్ నెంబర్ 75 ను స్వాధీనం చేసుకోవడానికి వెళ్లారు టీటీడీ సిబ్బంది.. అయితే, ఇంట్లోని రెండు ట్రంకు పెట్టెలను తెరిచి షాక్ కు గురయ్యారు టీటీడీ విజిలెన్స్ సిబ్బంది.. ట్రంకు పెట్టెల నిండా డబ్బులు ఉండటంతో ఉన్నతాధికారులకు సమాచారం చేరవేశారు.. ఇక, విజిలెన్స్ సమక్షంలో డబ్బులు లెక్కపెట్టారు టీటీడీ సిబ్బంది… తిరుమలకు వచ్చే విఐపిల వద్ద యాచించుకుంటూ.. జీవనం గడిపిన శ్రీనివాసన్… తన దగ్గర ఎంత డబ్బు ఉందో కూడా లెక్కబెట్టుకున్నట్టుగా లేడు.. ఎందుకంటే.. యాచించిన మొత్తం డబ్బు అలాగే ఉన్నట్టుగా తెలుస్తోంది.. రూ. పది లక్షలకు పైగా సొమ్ము ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక, ఆ ట్రంక్కు పెట్టెల్లో… రద్దు చేసిన పాత నోట్లు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది.
యాచకుడి ఇంట్లో భారీగా నగదు.. షాక్‌కు గురైన టీటీడీ విజిలెన్స్
cash