Site icon NTV Telugu

TTD Board Meeting: నేడు టీటీడీ పాలకమండలి కీలక భేటీ.. శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై చర్చ!

Ttd

Ttd

TTD Board Meeting: ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు టీటీడీ పాలకమండలి సమావేశం ప్రారంభం కానుంది. ఈ మీటింగ్ లో అనేక కీలక అంశాలపై చర్చించనున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై పాలకమండలి సమీక్ష జరపనుంది. భక్తుల సౌకర్యం కోసం చేయాల్సిన ఏర్పాట్లు, సన్నాహకాలు లాంటి అంశాలపై సమగ్ర చర్చ జరగనుంది. అలాగే, దేశంలోని పలు ప్రాంతాల్లో ఆలయాల నిర్మాణానికి సంబంధించిన అంశాలను కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఇందుకోసం శ్రీవాణి నిధులను కేటాయించే విషయంపై పాలకమండలి నిర్ణయం తీసుకోనుంది.

Read Also: Mirai : US బాక్సాఫీస్‌లో మిరాయ్ మ్యాజిక్.. భారీ ఓపెనింగ్స్‌తో దూసుకెళ్తున్న తేజ సజ్జ

మరోవైపు, తిరుమలలో శ్రీవారి ఆలయంలో ఈరోజు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరిగింది. సుప్రభాతం, తోమాల, అర్చన సేవలు ఏకాంతంగా నిర్వహించారు అర్చకులు. ఈ సందర్భంగా అష్టదళపాదపద్మారాధన సేవలను రద్దు చేశారు. ఇక, మధ్యాహ్నం నుంచి సర్వదర్శనం ప్రారంభంకానునంది. అలాగే, తిరుమలలో 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకేన్ లేని భక్తుల సర్వదర్శనానికి 12 గంటల సమయం ఉంటుంది. నిన్న శ్రీవారిని 65, 066 మంది భక్తులు దర్శించుకున్నారు. 24, 620 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక, హుండీ ఆదాయం 4.13 కోట్ల రూపాయలు వచ్చింది.

Exit mobile version