Site icon NTV Telugu

అమ్మ ఒడి పథకానికి75% హాజరు తప్పనిసరి: పేర్ని నాని

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మాకంగా అమలు చేస్తున్న అమ్మ ఒడి పథకానికి ఇక నుంచి 75 శాతం హాజరు తప్పనిసరిగా ఉండాలని మంత్రి పేర్ని నాని అన్నారు. నవంబర్‌ 8,2021 నుంచి ఏప్రిల్‌30,2022 వరకు సుమారు 130 రోజులు విద్యా సంవత్సరంగా ఉందని, ఇందులో ఖచ్చితంగా75 శాతం హాజరు ఉంటేనే అమ్మ ఒడి పథకానికి అర్హులు అవుతారని మంత్రి స్పష్టం చేశారు.

గత రెండేళ్లుగా కరోనా ఉండటంతో ఈ నిబంధనను అమలు చేయలేదని, ఇక నుంచి ఖచ్చితంగా అమలు చేస్తామని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు, పిల్లలు పాఠశాలలకు హాజరయ్యేలా చూడాలని మంత్రి కోరారు. అటు ఉపాధ్యాయలు సైతం పాఠశాలలలో హాజరు శాతం పెంచడానికి కృషి చేయాలన్నారు.

Exit mobile version