ఏపీలోని దేవాలయాల్లో పనిచేసేందకు ఆసక్తిగా ఉన్నవారికి దేవాదాయ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని దేవాలయాల్లో భారీగా ఖాళీలు గుర్తించిన దేవాదాయ శాఖ వాటి భర్తీకి సన్నాహాలు చేస్తోంది. ఆలయాల్లో ఉన్న రెగ్యులర్ పోస్టులన్నీ భర్తీ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. త్వరలో నోటిఫికేషన్ ఇచ్చేందుకు దేవాదాయ శాఖ సిద్దమవుతుంది.
అంతేకాకుండా దీనికోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి రాత పరీక్ష ద్వారా నియామకాలు చేపట్టే దిశగా అడుగులు వేస్తోంది. కానీ.. దేవాలయాల్లో ఎడిటర్, పీఆర్వో, హార్టికల్చర్ అధికారి, సెక్యూరిటీ ఆఫీసర్లను మాత్రం ఇంటర్వ్యూ ద్వారానే తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.