NTV Telugu Site icon

ఎస్ఈసీకి టీడీపీ లేఖ..

ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి స్థానిక ఎన్నికల నగారా మోగిన సంగతి తెలిసిందే.. గతంలో నిర్వహించని కార్పొరేషన్‌, స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. వివిధ కారణాలతో వాయిదా పడిన 533 వార్డులు, 85 ఎంపీటీసీలు, 11 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈనెల 3 నుంచి 5వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనుండగా… పంచాయతీలకు ఈనెల 14న, మున్సిపాలిటీలకు 15న, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు 16న ఎన్నికలు నిర్వహించనున్నారు. అయితే.. ఈ సమయంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు లేఖ రాసింది తెలుగుదేశం పార్టీ.

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆన్‌లైన్‌ ద్వారా నామినేషన్లు దాఖలు చేసే అవకాశం కల్పించాలని ఎస్ఈసీని కోరింది టీడీపీ.. నామినేషన్ల ఉప సంహరణలో అభ్యర్థులతో పాటు ఇతర వ్యక్తులను సాక్షులుగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.. ఇక, ఎన్నికల కోడ్ పక్కాగా అమలయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేసింది.. నామినేషన్ దాఖలు కేంద్రాల వద్ద కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరిన టీడీపీ.. ఎన్నికల్లో వలంటీర్ల జోక్యం లేకుండా నిఘా పెట్టాలవి డిమాండ్‌ చేశారు. బలవంతపు ఏకగ్రీవాలను పరిగణనలోకి తీసుకోవద్దని ఎస్ఈసీని కోరిన తెలుగుదేశం పార్టీ.. గతానుభవాల దృష్ట్యా చేస్తున్న సూచనలను ఎస్ఈసీ పరిగణనలోకి తీసుకోవాలన్న తెలుగుదేశం.