NTV Telugu Site icon

Chandrababu: కృష్ణంరాజు లేనిలోటు… ప్రభాస్ తీర్చాలి అని కోరుతున్నా..

Chandrababu

Chandrababu

Chandrababu: ఈ రోజు రెబెల్ స్టార్‌ని కోల్పోవడం బాధేస్తుందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. కృష్ణంరాజు భౌతికకాయం వద్ద చంద్రబాబు నివాళులర్పించారు. ఆయనకు చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంటుందన్నారు. ప్రజలకు సేవ చేసేందుకు మంత్రి అయ్యాడని ఆయన గుర్తు చేసుకున్నారు. ఆయన నటన ఎప్పటికీ మరిచిపోలేనిదని… సినీ ఇండస్ట్రీ ఒక పెద్ద దిక్కును కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా విషాద సమయమన్న చంద్రబాబు.. ఆయన లెగసీ ఎప్పటికీ ఉంటుందన్నారు. ఆయన స్ఫూర్తి భావితరాలకు ఆదర్శంగా ఉండాలన్నారు. ప్రభాస్‌ను కలిసిన చంద్రబాబు.. ధైర్యంగా ఉండాలని ప్రభాస్‌కు చెప్పానన్నారు. కృష్ణం రాజు లేనిలోటు… ప్రభాస్ తీర్చాలని అని కోరుతున్నానని చంద్రబాబు అన్నారు.

Krishnam Raju: అనుష్కతో ప్రభాస్ పెళ్లి.. కృష్ణంరాజు ఏమనేవారంటే..?

ప్రముఖ నటుడు ‘రెబల్ స్టార్’ కృష్ణంరాజు(83) కన్నుమూశారు. హైదరాబాద్​లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున 3.25 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారని కుటుంబసభ్యులు తెలిపారు. సోమవారం హైదరాబాద్​లో అంత్యక్రియలు జరుగుతాయని చెప్పారు. రెబల్‌స్టార్‌ కృష్ణం రాజు మరణంతో ఆయన అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయారు. వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు ఆయన మృతిపట్ల విచారం వ్యక్తం చేస్తున్నారు.