NTV Telugu Site icon

Srisailam Sravanamasam: నేటినుంచి ఆగస్ట్ 28 వరకు శ్రీశైలంలో శ్రావణ మాసోత్సవాలు

Srisailam 1 (1)

Srisailam 1 (1)

శ్రావణమాసం సందర్భంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శ్రీశైల మహాక్షేత్రంలో నేటి నుండి ఆగష్టు 28 వరకు దేవస్థానం శ్రావణ మాసోత్సవాలు నిర్వహించనుంది. ఈ మాసోత్సవాలపై ఆలయ ఈవో లవన్న దేవస్థానం అధికారులు, అర్చకులు,సిబ్బందితో దేవస్థానం పరిపాలన భవనంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో శ్రావణమాసం నెలరోజులలో ఆంధ్రప్రదేశ్‌ నుండే కాకుండా కర్ణాటక,మహారాష్ట్ర ఇతర రాష్ట్రాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారనన్నారు వేలాదిమంది భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా స్వామి అమ్మవారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేయాలన్నారు.

శ్రావణమాసం శని,అది,సోమ,పౌర్ణమి రోజులలో భక్తులు స్వామివారికి నిర్వహించుకునే గర్భాలయ అభిషేకాలు పూర్తిగా నిలుపుదల చేస్తామన్నారు. సామూహిక అభిషేకాల సేవకర్తలకు సైతం గత సంవత్సరం వలే శ్రావణ శని,అది,సోమ,పౌర్ణమిలలో స్వామివారి అలంకరణ దర్శనం మాత్రమే కల్పిస్తామన్నారు. అలాగే, శ్రావణమాస రద్దీ రోజులలో అమ్మవారి అంతరాలయంలో కుంకుమార్చన నిలుపుదల చేసి ఆశీర్వచన మండపంలో కుంకుమార్చనలు నిర్వహణకు ఏర్పాటు చేస్తామన్నారు.

శ్రావణమాస ప్రారంభం నుండి అనగా రేపటి నుండి లోక కళ్యాణార్ధం అఖండ శివనామలతో శివ సప్తాహ భజనలు భక్తబృందాలచే ఏర్పాటు చేస్తామన్నారు. శ్రావణ మాసం రెండు,నాలుగవ శుక్రవారాలలో ముత్తైదువులకు ఉచితంగా సామూహిక వరలక్ష్మీవ్రతాలు,నాలుగవ శుక్రవారం 500 మంది చెంచు గిరిజన మహిళలకు ఉచితంగా వరలక్ష్మి వ్రతాలు నిర్వహిస్తామని ఆలయ ఈవో లవన్న తెలిపారు.

Somu Veerraju: ఏపీ పరిస్థితి బాగుంటే అప్పుల కోసం ఎందుకు పరిగెడుతున్నారు?