Site icon NTV Telugu

PM Narendra Modi: సత్యసాయితో అనుబంధాన్ని గుర్తుచేసుకున్న ప్రధాని మోడీ.. తరతరాలకు మార్గదర్శకం..

Pm Narendra Modi

Pm Narendra Modi

PM Narendra Modi: ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి ఆంధ్రప్రదేశ్‌ పర్యటనకు వచ్చారు.. పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు.. సత్యసాయి మహా సమాధిని దర్శించుకుని నివాళులర్పించారు.. అయితే, తన పర్యటనకు ముందు.. తా పుట్టపర్తి టూర్‌పై ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు ప్రధాని నరేంద్ర మోడీ.. తనకు సత్యసాయితో ఉన్న అనుబంధాన్ని.. ఆయన సేవలను కొనియాడుతూ.. గతంలో తాను సత్యసాయిని కలిసిన ఫొటోలను షేర్‌ చేశారు..

Read Also: Australia: ఆస్ట్రేలియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 నెలల భారతీయ గర్భిణీ మృతి

ప్రధాని నరేంద్ర మోడీ ఎక్స్‌ పోస్ట్ (ట్వీట్‌) విషయానికి వస్తే.. “రేపు, నవంబర్ 19న పుట్టపర్తిలో జరిగే శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనడానికి ఆంధ్రప్రదేశ్‌లోని నా సోదర సోదరీమణులలో ఒకరిగా ఉండటానికి ఎదురుచూస్తున్నాను. సమాజ సేవ, ఆధ్యాత్మిక మేల్కొలుపు కోసం ఆయన జీవితం, చేసిన ప్రయత్నాలు తరతరాలకు మార్గదర్శకంగా ఉంటాయి. ఆయనతో సంభాషించడానికి మరియు ఆయన నుండి నేర్చుకోవడానికి కొన్ని సంవత్సరాలు నాకు వివిధ అవకాశాలు లభించాయి.” అంటూ ఎక్స్‌లో పేర్కొన్నారు ప్రధాని మోడీ.. ఇక, మా సంభాషణల నుండి కొన్ని దృశ్యాలు ఇక్కడ ఉన్నాయి అంటూ.. సత్యసాయి బాబాను గతంలో కలిసిన కొన్ని చిత్రాలను ఎక్స్‌లో పంచుకున్నారు..

Exit mobile version