Site icon NTV Telugu

Deputy CM Pawan Kalyan: ఎంతో మందిని ప్రభావితం చేశారు.. సత్యసాయి స్ఫూర్తిని కొనసాగిస్తాం..

Deputy Cm Pawan Kalyan

Deputy Cm Pawan Kalyan

Deputy CM Pawan Kalyan: ఎంతో మందిని ప్రభావితం చేసిన వ్యక్తి శ్రీ సత్య సాయి బాబా అన్నారు.. ప్రపంచానికి ఆధ్యాత్మికంగా వెలుగులిచ్చిన అరుదైన శక్తి శ్రీ సత్యసాయి బాబా అని ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. పుట్టపర్తిలో జరుగుతున్న సత్యసాయి శతజయంతి వేడుకల్లో ఆయన ప్రసంగించారు. అనంతపురం లాంటి వెనుకబడిన ప్రాంతంలో సత్యసాయి జన్మించడం ఎంతో ప్రత్యేకమైన విషయం అన్నారు పవన్‌ కల్యాణ్.. విదేశాల్లో కూడా సత్యసాయి ప్రభావం అపారంగా ఉంది. ఎన్నో దేశాల్లో అనేక మంది భక్తులను చూసాను. ఆయన చూపిన మానవతా మార్గం ప్రపంచవ్యాప్తంగా మార్పును తీసుకువచ్చింది అని అన్నారు.

Read Also: Kinetic Green Electric 3 Wheelers: ఎలక్ట్రిక్ 3-వీలర్ వాహనదారులకు నో టెన్షన్.. ఇకపై 15 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్!

సత్యసాయి బాబా ప్రజల ప్రాథమిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని సామాన్యుడికి తాగునీరు అందించాలనే లక్ష్యంతో పని చేశారని పేర్కొన్నారు పవన్‌ కల్యాణ్.. జల్‌ జీవన్‌ మిషన్‌కు ముందుగానే ఆయనే ఆలోచించారు. నీటి కోసం ఎన్నో ఎడారులు తిరిగిన ప్రజలకు ఆశగా నిలిచారు. అలాంటి సేవా తత్పరత అరుదైనది అని పవన్‌ పేర్కొన్నారు.సచిన్‌ టెండూల్కర్‌, ఐఏఎస్‌లు, శాస్త్రవేత్తలు, ప్రపంచ నాయకులు సహా వేలాది మంది సత్యసాయి సేవా సిద్ధాంతం, ఆధ్యాత్మికత, మానవతా మార్గం ప్రభావంతో మారిపోయారని పవన్‌ చెప్పారు.

సత్యసాయి బోధనలు కాలాతీతం. ప్రేమ, సేవ, దయ—ఇవి ఆయన సందేశం అని గుర్తు చేశారు పవన్‌ కల్యాణ్… ఆయన చూపిన మార్గంలో నడుస్తూ సేవా కార్యక్రమాలు మరింత విస్తృతం చేస్తాం అని ప్రకటించారు.. ఇది కేవలం వేడుక కాదు.. ఒక మహానీయుని భావజాలాన్ని తరువాతి తరాలకు అందించే సంకల్పం” అని పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. మన కంటే ఎక్కువగా శ్రీ సత్యసాయి బాబా గురించి విదేశాలకు తెలుసు అని చెప్పారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్..

Exit mobile version