Site icon NTV Telugu

Somu Veerraju: పంచాయతీరాజ్ వ్యవస్థను భ్రష్టుపట్టించారు

అన్నమయ్య జిల్లా మదనపల్లిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పర్యటించారు. రూ.15 వేల కోట్ల కు రాష్ట్రానికి ప్రత్యేక హోదా అందిస్తున్నాం. చంద్రబాబు ఆరు ప్రాజెక్టులు కావాలని కేంద్రాన్ని అడిగారు. పోలవరానికి రూ 55 వేల కోట్లు, ఉపాధి హామీ పథకానికి రూ 70 వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం అందించిందన్నారు సోము వీర్రాజు.

రాయలసీమ నుంచి అమరావతి కలిపేందుకు ఆరు లైన్లు, 4 లెన్లతో జాతీయ రహదారి నిర్మాణం చేయబడుతున్నామని చెప్పారు. కడప, కర్నూల్ లో ఎయిర్ పోర్టు నిర్మిస్తున్నాం. బీజేపీ పాలనలో దేశం ఆర్ధికంగా పురోభివృద్ధి చెందుతుంటే జగన్ పాలనలో రాష్ట్రం అప్పులపాలు అవుతోంది. అన్నమయ్య జిల్లాలో టమాటా, చిత్తూరు జిల్లాలో మామిడి, చింతపండు వాణిజ్య పంటలకు ధరలు తగ్గిపోతుంటే ప్రత్యామ్నయం ఆలోచించాల్సిన ప్రభుత్వం ఎర్ర చందనం ఎర్ర చందనం విక్రయానికి ప్రత్యామ్నాయం చూస్తోందని విమర్శించారు.

కేవలం పోలవరం మీదే టీడీపీ, వైసిపి లు దృష్టి పెట్టాయి కానీ రాయలసీమలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు వైపు దృష్టి పెట్టలేదని సోము వీర్రాజు విమర్శించారు. పంచాయతీరాజ్ వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని దుయ్యబట్టారు.

Exit mobile version