Site icon NTV Telugu

షుగర్ ఫ్యాక్టరీల మూతతో చెరుకు రైతుకు చేదు

ఏపీ ప్రభుత్వంపై ఒక స్థాయిలో విరుచుకుపడుతున్నారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. షుగర్ ఫ్యాక్టరీలు మూత.. చెరుకు రైతుల జీవితాల్లో చేదు మిగిల్చిందన్నారు. పూజ్య బాపూజీ కలలు కన్న సహకార వ్యవస్ధను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలకులు నిర్వీర్యం చేస్తున్నారు.సహకారవ్యవస్థతోనే దేశాభివృద్ది జరుగుతుంది అటువంటి వ్యవస్థను మంట కలుపుతున్నారు.

Read Also వంగవీటి రాధా, కొడాలి నాని, వంశీపై బోండా ఉమ ఆసక్తికర వ్యాఖ్యలు

వ్యవసాయమే జీవనాధారంగా ఉన్న మన రాష్ట్రంలో చెరుకు రైతును ప్రభుత్వాలు నట్టేట ముంచుతున్నాయి.సహకార చెక్కర కర్మాగారాల పై ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను నష్టాల బారిన పడకుండా కేంద్ర ప్రభుత్వం రూ. 910 కోట్లు ఆర్థిక సహకారం అందిస్తోందని సోము వీర్రాజు తెలిపారు, రాష్ట్రంలో ఖాయిలా పడిన పంచదార మిల్లులకు రూ. 100 నుంచి రూ. 200 కోట్లు కేటాయిస్తే షుగర్ ఫ్యాక్టరీ ల నిర్వహణ ,చెరకు రైతుల బాకీలు తీరతాయన్నారు. ఈ విషయంలో జగన్ స్పందించాలని సోము వీర్రాజు ఒక ప్రకటనలో కోరారు.

Exit mobile version