Site icon NTV Telugu

పుట్టిన రోజు సందర్భంగా ప్రజలకు ఇసుక ఉచితంగా ఇవ్వండి : సోమిరెడ్డి

తన జన్మదినం సందర్భంగా…సీఎం జగన్ రాష్ట్ర ప్రజలకు ఇసుక ఉచితంగా ఇవ్వాలని కోరుతున్నాన‌ని టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వ ఇసుక పాలసీతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని… ఇసుక టన్ను రూ. 475 ధరగా నిర్ణయించామని చెప్పారు.. ఇప్పుడు రూ. 900కు అమ్ముతున్నారని ఫైర్ అయ్యారు. మార్కాపురంలో ఇసుక టన్నురూ. 1200 అమ్ముతున్నారని… ఇరిగేషన్ శాఖ డ్రెడ్జింగ్ చేసే ఇసుకను కూడా జేపీ కంపెనీకే ఎందుకు ఇస్తున్నారు? అని నిల‌దీశారు.

https://ntvtelugu.com/roja-counter-to-nara-bhubaneswar/

ఇరిగేషన్ శాఖ సొంత ఖర్చుతో కృష్ణా నదిలో డ్రెడ్జింగ్ చేస్తోందని.. డ్రెడ్జింగ్ ద్వారా వచ్చిన రూ.570 కోట్ల విలువైన ఇసుకను జేపీ కంపెనీకి ఇవ్వడమేంటీ..? అని నిల‌దీశారు. జేపీ కంపెనీకి పని దక్కేసరికి రూ.70 కోట్ల విలువైన ఇసుక యార్డులో నిల్వవుంది.. ఆ ఆదాయం ఏమయ్యింది..? అని ప్ర‌శ్నించారు. ఒక లారీ ఇసుక రూ. 1 లక్షకు అమ్ముతున్నారు.. నెలకు రూ. 600 కోట్లు ఇసుక ద్వారా దోచుకుంటున్నారన్నారు. వినియోగదాలు తమ బుకింగుల ద్వారా రూ. 10 కోట్ల డబ్బులు కడితే వాటిని తిరిగి చెల్లించలేదని ఆగ్ర‌హించారు.

Exit mobile version