Site icon NTV Telugu

ఆనందయ్యకు సోమిరెడ్డి లేఖ…

కృష్ణపట్నం ఆనందయ్యకు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లేఖ రాసారు. అందులో ”ఆయుర్వేదం మందుతో మీ ఖ్యాతి జాతీయ స్థాయిలో మార్మోగుతోంది. రాజకీయాలకు అతీతంగా అందరూ మీకు అండగా నిలుస్తున్నారు. ప్రజలందరూ దేవుడిగా భావిస్తున్న మిమ్మల్ని భద్రత పేరుతో నిర్బంధించడంపై చాలా బాధపడుతున్నాం. జైలులో ఖైదీకి ఉండే స్వేచ్ఛ కూడా మీకు లేదు చాలా బాధాకరం. ప్రభుత్వం మీకు భద్రత కల్పించకపోయినా కృష్ణపట్నం ఊరంతా అండగా ఉంది..వాళ్లే మీకు రక్షణ కల్పిస్తారు. వైసీపీ నాయకులకు, అధికారులకు, వారి సన్నిహితులకు మీ మందు అందించిన తర్వాతే సామాన్యులకు పంపిణీకి అనుమతి ఇచ్చేలా ఉన్నారు. రక్షణ విషయంలో సాక్షాత్తు గుంటూరు రేంజ్ ఐజీనే తమకు సంబంధం లేదు..స్థానిక ఎమ్మెల్యేతో మాట్లాడుకోండనే స్థాయికి వచ్చారు. మీ గొప్పతనం తెలుసుకుని ఉప రాష్ట్రపతి నుంచి జిల్లా నాయకుల వరకూ అందరూ స్పందిస్తున్నారు..మద్దతు పలుకుతున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం నోరు విప్పకపోవడం దురదృష్టకరం” అని పేర్కొన్నారు.

Exit mobile version