NTV Telugu Site icon

దిశ పోలీస్‌ స్టేషన్‌లో ఎస్‌ఐ ఆత్మహత్యాయత్నం..

Suicide Attempt

Suicide Attempt

విజయవాడలోని దిశ పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐ విజయ్‌ కుమార్‌ ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం కలకలం రేపుతోంది.. నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశారు ఎస్‌ఐ విజయ్‌ కుమార్.. ఉన్నతాధికారుల వేధింపులు భరించలేక ఆయన ఆత్మహత్యాయత్నం చేశారనే ప్రచారం సాగుతోంది.. ఇక, కుటుంబ సభ్యులు సకాలంలో ఆస్పత్రికి తరలించడంతో ఎస్ఐకి ప్రాణాపాయం తప్పింది.. ప్రస్తుతం విజయ్ కుమార్ ఆరోగ్యం పరిస్థితి నిలకడగా ఉందని చెబుతున్నారు.. మరోవైపు, ఎస్ఐ విజయ్‌కుమార్‌ ఆత్మహత్యాయత్నానికి కారణం వేధింపులా..? వేరే కారణమా..? అనేది ఆయననే అడగాలంటూ కామెంట్‌ చేవారు ఏసీపీ నాయుడు. ఇక, ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు పోలీసులు.. ఆస్పత్రికి చేరుకుని విచారణ చేస్తున్నారు.