NTV Telugu Site icon

CPI Narayana US Tour: ఆ ఫోటోతో అమెరికాలో చేదు అనుభవం.. షాకైన నారాయణ

Narayana Cpi1

Narayana Cpi1

సీపీఐ నారాయణ.. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఆయన పేరు తెలియనవారుండరు. రాజకీయంగానే కాదు.. వివిధ సామాజిక అంశాలపైన ఆయన ఘాటుగా స్పందిస్తుంటారు. బిగ్ బాస్ విషయంలో ఆయన చేసిన కామెంట్లు హాట్ టాపిక్ అయ్యాయి. ఏపీలో విద్యుత్ మీటర్ల విషయంలోనూ ఆయన హాట్ కామెంట్లు చేశారు. సీపీఐ అగ్రనేత నారాయణ అమెరికా పర్యటనలో వున్నారు. ఆయనకు అక్కడ చేదు అనుభవం ఎదురైంది. అమెరికాలోని ఫ్లోరిడా విమానాశ్రయ సిబ్బంది ఆయన్ను అడ్డుకున్నారు. విదేశీ పర్యటనలో ఉన్న నారాయణ… భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి క్యూబాలోని హవానా విమానాశ్రయం నుంచి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది.

Read Also: Gujarat Bridge Collapse: ఈ రోజు మోర్బీలో ప్రధాని పర్యటన.. ఆస్పత్రికి హుటాహుటిన రంగులు..

క్యూబాలో కమ్యూనిస్టు పార్టీ సమావేశాలకు హాజరవడానికి వెళ్ళారు నారాయణ… అక్కడ ఆ దేశ అధ్యక్షుడితో ఫోటో కూడా దిగారు. ఫ్లోరిడా విమానాశ్రయంలో ఆయన ప్రయాణ వివరాలను అడిగిన సిబ్బంది…. ఫోన్ లో క్యూబా దేశాధ్యక్షుడితో దిగిన ఫోటోను చూసి సుమారు 69 గంటలపాటు అక్కడే ఆపేశారు. అనంతరం పూర్తి వివరాలు తెలుసుకుని వదిలేసినట్టు నారాయణ తెలిపారు. సోమవారం రాత్రి మీడియాకు పంపిన సందేశంలో ఆయన ఈ వివరాలను తెలిపారు. ఏ అంశం పైన అయినా ఆయన స్పందిస్తే.. దానిని వీడియో రూపంలో మీడియాకు, తన సన్నిహితులకు వివరించడం ఆనవాయితీగా వస్తోంది. ఏమైందంటూ నారాయణకు సన్నిహితులు వాకబు చేశారు.

Read Also: Bharat Jodo Yatra: నగరానికి చేరుకున్న భారత్ జోడో యాత్ర.. అక్కడ ట్రాఫిక్‌ మళ్లింపు