Site icon NTV Telugu

ఏపీ ఫైబర్‌ నెట్‌ కేసులో సాంబశివరావు అరెస్ట్‌

ఏపీ ఫైబర్‌ నెట్‌ కేసు దర్యాప్తు లో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఐఆర్టీఎస్ అధికారి సాంబశివరావును సీఐడీ అధికారులు అరెస్ట్‌ చేశారు. ఈ కేసులో సాంబశివరావును గత ఐదు రోజులుగా విచారిస్తున్నారు. సాంబశివరావు గతంలో ఏపీ ఫైబర్‌ నెట్‌ ఎండీ గా వ్యవహరించిన సమయంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఫైబర్‌ నెట్‌ తొలి దశలో రూ. 320 కోట్ల టెండర్లలో రూ.. 121 కోట్ల అవినీతిని సీఐడీ గుర్తించింది. ఎండీ హోదాలో సాంబశివరావు టెరాసాఫ్ట్‌ సంస్థకు కాంట్రాక్టు ఇచ్చారని… ఆ సమయం లో తీవ్ర స్థాయిలో అవకతవకలు జరిగాయని సీఐడీ కేసు నమోదు చేసింది.

Exit mobile version