Site icon NTV Telugu

Sai Priya Missing Case: పోలీస్ స్టేషన్‌లో సాయిప్రియ కొత్త డ్రామా

Sai Priya New Game

Sai Priya New Game

Sai Priya Starts Another Drama In Vizag Airport Police Station: విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ వద్ద మాయమైనప్పటి నుంచి సాయిప్రియ ఒకదానికి మించి మరొక ట్విస్టులు ఇస్తూనే ఉంది. సముద్రంలో గల్లంతయ్యిందనుకుంటే.. బెంగుళూరులో ప్రియుడు రవితో ప్రత్యక్షమైంది. ఇంతలోనే అతనితో తనకు వివాహమైందంటూ షాకిచ్చింది. తనని వెతకొద్దని, లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్న సాయిప్రియ.. పోలీస్ స్టేషన్‌లోనే మరో కొత్త డ్రామాకు తెరతీసింది.

బెంగుళూరులో ఉన్న సాయిప్రియ దంపతుల ఆచూకీ తెలుసుకొని.. పోలీసులు వారిని విశాఖకు తరలించిన విషయం తెలిసిందే! ప్రస్తుతం విశాఖ ఎయిర్‌పోర్టులో ఉండగా.. సాయిప్రియ మరో కొత్త డ్రామా ప్రారంభించింది. బంధువుల నుంచి తన ప్రాణాలకు ముప్పు ఉందంటూ ఫిర్యాదు చేసింది. దీంతో.. సాయిప్రియ భర్త శ్రీనివాస్‌ను స్టేషన్‌కి పిలిచించి, ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇవ్వాలని పోలీసులు నిర్ణయించారు. సాయిప్రియ మేజర్ కావడంతో.. ఆమె ఇష్టప్రకారమే నిర్ణయం తీసుకునే వెసులుబాటు ఉంటుందని అంటున్నారు. అంటే.. శ్రీనివాస్‌కి ఎలాంటి న్యాయం జరుగుతుందో చూడాలి.

కాగా.. మ్యారేజ్ డే గిఫ్టుగా భర్త శ్రీనివాస్ ఇచ్చిన బంగారు గాజుల్ని సాయిప్రియ అమ్మినట్టు తేలింది. ఆ అమ్మిన డబ్బులతోనే తన ప్రియుడు రవితో రెండు రోజుల పాటు దర్జాగా గడిపింది. ఇంత రాద్ధాంతం చేసిన సాయిప్రియ ఫేస్‌లో కనీసం పశ్చాత్తాప భావనలు కూడా కనిపించడం లేదని తెలిసింది.

Exit mobile version