Site icon NTV Telugu

Roja Praises Jagan: త్రిసభ్య కమిటీ జగన్ విజయం

నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ ఎమ్మెల్యే ఆర్ కె రోజా ముఖ్యమంత్రి జగన్‌ పై ప్రశంసలు కురిపించారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ విభజన పైన త్రిసభ్య కమిటీ వేయడం శుభపరిణామం అన్నారు. హోంశాఖ ప్రత్యేక హోదా అంశంగా చెర్చడం సీఎం జగన్మోహన్ రెడ్డి సాధించిన విజయంగా మేము భావిస్తున్నాం అన్నారు.

ప్రతిపక్షంలో ఉన్నపుడు ఎన్నోరకాలుగా పోరాటం చేశారు జగన్. ముఖ్యమంత్రి అయ్యాక ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి ప్రత్యేక హోదా అంశంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోం మంత్రిని కలిశారు. ఏపీ ప్రజలు విభజన వల్ల ఎంత కష్టపడుతున్నారో నష్టం పోయారో మోదీ మొన్న పార్లమెంటులో స్పష్టంగా చెప్పారన్నారు రోజా.

https://ntvtelugu.com/ysrcp-mla-rk-roja-praises-on-telangana-cm-kcr-at-yadadri/

చంద్రబాబు రాష్ట్రాన్ని రెండు ముక్కలు చెక్కలు చేయటమే కాకుండా ప్రత్యేక హోదా అంశం పక్కన పెట్టి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తే చాలు అని తన ప్యాకేజీ కోసం రాష్ట్రాన్ని కష్టంలోకి తోసేసాడని మండిపడ్డారు రోజా. ఆనాడే చంద్రబాబు ప్రతిపక్ష పార్టీలను పోగేసి కేంద్ర ప్రభుత్వం వద్దకు తీసుకెళ్లాలి. ప్రత్యేక హోదా గురించి పోరాటం చేద్దామన్నా పట్టించుకోలేదన్నారు రోజా. తెలంగాణ సీఎం కేసీఆర్ కారణజన్ముడు. యాదాద్రి ఆలయ నిర్మాణం చూస్తుంటే మతి పోతోంది.ఆలయ నిర్మాణం చూడటానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు. అదేవిధంగా ప్రస్తుతకాలంలో స్టోన్ తో కట్టడం చాలా వ్యయప్రయాసలతో కూడుకున్న వ్యవహారం అన్నారు రోజా.

Exit mobile version