రఘురామ కృష్ణంరాజుకు సుప్రీంకోర్ట్ లో కొంత ఊరట లభించింది. నిన్నటి రోజున రఘురామ అరెస్ట్, బెయిల్, ప్రైవేట్ లేదా ఆర్మీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలకు సంబందించి సుప్రీం కోర్టులో వాదనలు జరిగాయి. ఎయిమ్స్ లో వైద్యపరీక్షలు నిర్వహించేందుకు ఏపీ సీఐడీ పట్టుపట్టగా, రఘురామరాజు తరపు న్యాయవాదులు ప్రైవేట్ లేదా ఆర్మీ ఆసుపత్రిలో వైద్యం అందించేలా ఆదేశాలు ఇవ్వాలని వాదించారు. కాగా, సుప్రీంకోర్టులో రఘురామకు కొంత ఊరట లభించింది. ఆర్మీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించేందుకు అవకాశం ఇచ్చింది. వైద్య పరీక్షలను వీడియో తీయాలని సుప్రీం ఆదేశించింది. వైద్య పరీక్షల నివేదికను సీల్డ్ కవర్లో అందజేయాలని ఆదేశించింది కోర్టు. సుప్రీం కోర్టు ఆదేశాలతో రఘురామ కృష్ణంరాజును నిన్న రాత్రి గుంటూరు నుంచి సికింద్రాబాద్ కు తరలించారు. ఈరోజు సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆసుపత్రిలో వైద్యపరీక్షలు నిర్వంహించనున్నారు.
సుప్రీం కోర్టులో రఘురామకు ఊరట…ఆర్మీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు
