Site icon NTV Telugu

పీఆర్సీపై క‌సరత్తు పూర్తి..!

YS Jagan

ఆంధ్రప్రదేశ్‌లో గత కొంత కాలంగా పీఆర్సీ వ్యవహారం హట్‌టాపిక్‌గా నడుస్తోంది… అయితే, తాజా సమాచారం ప్రకారం.. పీఆర్సీపై ప్రభుత్వ కరసరత్తు దాదాపుగా పూర్తిఅయ్యింది.. పీఆర్సీ నివేదిక, ఉద్యోగ సంఘాల డిమాండ్లు, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని క్రోడీకరించి నోట్ సిద్ధం చేసింది సీఎస్ నేతృత్వంలోని హైలెవల్ కమిటీ.. ఈ సాయంత్రం ఆ రిపోర్ట్ ను సీఎస్ సమీర్ శర్మ.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది… ఇక, ఉద్యోగ సంఘాలకు కూడా ఆ రిపోర్ట్ ఇవ్వనున్నారు సీఎస్… అనంతరం పీఆర్సీ పై ఉద్యోగ సంఘాలతో సీఎం వైఎస్‌ జగన్ సమావేశం అయ్యే అవకాశం ఉండగా.. ఆ తర్వాతే పీఆర్సీపై ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడుతుందని చెబుతున్నారు..

కాగా, పీఆర్సీపై ఉద్యోగులు ఆందోళన చేస్తున్న సమయంలో ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో ఇప్పటికే సమీక్ష నిర్వహించిన సీఎం వైఎస్‌ జగన్.. ప్రభుత్వ ఆర్థిక పరిస్ధితి దృష్ట్యా.. ఎంత మేర ఫిట్​మెంట్ ఇచ్చేందుకు సాధ్యమవుతుందనే విషయమై సమాలోచనలు చేశారు.. ఉద్యోగులకు ఇప్పటికే 27 శాతం మధ్యంతర బృతి ఇస్తుండగా.. ఆపై ఎంత మేర ఫిట్​మెంట్ పెంచితే బడ్జెట్​పై ఎంత భారం పడుతుందనే అంశాలపై అధికారులను సీఎం నివేదిక అడిగారు. ఇక, సీపీఎస్ రద్దు చేస్తే బడ్జెట్​పై ఎంత భారం పడుతుంది.. ఎంత మేర నిధులు వెచ్చించాల్సి వస్తుంది, ఎలా సర్దుబాటు చేయాలనే విషయంపై అధికారులతో సీఎం సమాలోచనలు జరిపినట్టుగా తెలుస్తోంది.. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అధ్యయనం చేసిన సీఎస్‌ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ నివేదికను సిద్ధం చేసినట్టుగా సమాచారం.

Exit mobile version