ఢిల్లీలో బలప్రదర్శన..
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం వేడేక్కింది. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు ఏపీ రాజకీయాలను మరింత అగ్గి రాజేస్తున్నాయి. వైసీపీ నేతలు టీడీపీ ఆఫీస్‌లపై దాడులు చేశారని టీడీపీ ఆరోపిస్తే , అధికార పక్షం మాత్రం రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకు టీడీపీ డ్రామా ఆడుతుందని వైసీపీ నేతలు అంటున్నారు. నిన్నటి జగన్ ప్రెస్‌మీట్‌లో ఓర్వలేక మాపై బురద జల్లుతున్నారన్నారు. జగన్ గుండా రాజకీయాలు చేస్తున్నారన్నారని టీడీపీ ఆరోపిస్తుంది. టీడీపీ ఏపీలో రాష్ట్రపతి పాలనా పెట్టాలని కోరుతున్నాయి. వైసీపీ శాంతి భద్రతలకు ఎవ్వరూ విఘాతం కలిగించిన ఊరుకోబోమని స్పష్టం చేసింది.
దీంతో ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. పట్టాభిఅరెస్ట్, డ్రగ్స్ కేసు వంటి అంశాలను టీడీపీ గట్టిగా వినిపిస్తుండగా, వైసీపీ మాత్రం పట్టాభి సీఎంను దూషించడమేంటని ఆరోపిస్తుంది. దీంతో ఇరు పక్షాలు ఢీల్లీ వెళ్లి హోం మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేసే అవకాశాలు ఉన్నాయి. జగన్ పాలన చూసి జీర్ణించుకోలేకనే టీడీపీ తమపై ఆరోపణలు చేస్తుందని వైసీపీ నేతలు అంటున్నారు. ఆరోపిస్తున్నారు. వైసీపీ నేతలుసీఎంను దూషించే అధికారం టీడీపీనేతలకు లేదన్నారు. ప్రజల్లో జగన్‌కు వస్తున్న ప్రజాదరణను చూసి టీడీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారన్నారు. మరోవైపు టీడీపీ అధికారులు వైసీపీ చెప్పినట్టు నడుచుకుంటున్నారని రాష్ట్రంలో అక్రమ పాలన రాజ్యమేలుతుందన్నారు. చంద్రబాబు దీక్ష అనంతరం ఢీల్లీ వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అటు వైసీపీ శ్రేణులు కూడా ఢీల్లీ వెళ్లనున్నాయి.