Site icon NTV Telugu

థర్డ్ వేవ్ ఎఫెక్ట్ చిన్న పిల్లలపై ఎక్కువ ఉంటుందని చెప్పలేము

పిల్లలే థర్డ్ వేవ్ కరోనా బారిన ఎక్కువగా పడతారని చెప్పలేం అని…తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పిడియాట్రిక్ కోవిడ్-19 టాస్క్ ఫోర్స్ కమిటీ ఛైర్మన్ డా. చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. తాజాగా ఎన్టీవీతో మాట్లాడిన ఆయన ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. పిల్లలకు సంబంధించి వైద్య సదుపాయాల కల్పన కూడా దీనిలో భాగం అన్నారు. ఫిబ్రవరిలో నిర్వహించిన సీరో సర్వేలో పిల్లల్లో కూడా దాదాపుగా పెద్దలతో సమానంగా యాంటి బాడీస్ గమనించారు అని పేర్కొన్నారు. అయితే మాస్క్, భౌతిక దూరం వంటి జాగ్రత్తలు పాటించటం తప్పనిసరి అని తెలిపారు.

Exit mobile version