NTV Telugu Site icon

Peddireddy Ramachandra Reddy: ఇతర రాష్ట్రాలకు ఏపీ ఒక మోడల్ స్టేట్‌గా నిలుస్తుంది

Peddireddy Ramachandrareddy

Peddireddy Ramachandrareddy

Peddireddy Ramachandra Reddy On AP Environment Corporation: పర్యావరణ పరిరక్షణపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి సారించారని.. ఒక కొత్త ఆలోచనతో ఏపీ ఎన్విరాన్మెంట్ మేనేజ్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారని విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ.. ఈ కార్పొరేషన్ ఎవరిమీద ఆధారపడకుండా నడుస్తుందని చెప్పారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగానే ఫ్లై యాష్ మాడ్యూల్ రూపొందించామన్నారు. పర్యావరణానికి ఇబ్బంది కలిగించే మరిన్ని అంశాలన్నింటికీ ఓ మాడ్యూల్ తయారు చేసి, కార్పొరేషన్ పరిధిలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. అలా జరిగితే పర్యావరణ పరిరక్షణకు మరింతగా దోహదపడుతుంద్నారు. మన రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఒక మోడల్ స్టేట్‌గా నిలవడం ఖాయమన్నారు.

Noida Crime: యజమాని అరాచకం.. పనిమనిషిని లిఫ్ట్‌లో నుంచి లాక్కెళ్లి..

అలాగే.. రాష్ట్ర జీడీపీ పురోగమనానికి విద్యుత్ శాఖ ఎంతో కీలకమైందని పెద్దిరెడ్డి తెలిపారు. విద్యుత్ శాఖపై జరిగే వ్యతిరేక ప్రచారానికి కూడా.. విద్యుత్ శాఖ విద్యుత్‌ని సరఫరా చేస్తోందన్నారు. 9 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని.. రాష్ట్ర అభివృద్ధిలో కీలకమైన ఆక్వా రంగానికి కూడా సబ్సిడీపై విద్యుత్ ఇస్తున్నామని చెప్పారు. విద్యుత్ సబ్సిడీల కోసం రూ.65 వేల కోట్లు వెచ్చిస్తున్నామన్నారు. రూ.3,500 కోట్ల వ్యయంతో జగనన్న కాలనీలకు విద్యుత్ ఇచ్చేందుకు రుణం తీసుకున్నామన్నారు. విద్యుత్ సంస్థలు సాధించే అభివృద్దే.. విమర్శలకు సమాధానం చెప్పాలన్నారు. ఇటీవల కృష్ణపట్నంలో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెరిగిందని.. పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ఉత్పత్తిలో ఏపీ లీడ్ స్టేట్‌గా ఉందని వెల్లడించారు. ఉద్యోగులకు అనుకూలంగానే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని.. అన్ని శాఖలకు విద్యుత్ శాఖ అవసరం ఉంటుందని చెప్పారు.

Pawan Kalyan: సీఎం జగన్‌కు పవన్ బహిరంగ లేఖ.. ఆ పింఛన్లు ఎందుకు తొలగించారు?

ఇదే సమయంలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ మాట్లాడుతూ.. విద్యుత్ శాఖ చాలా ముఖ్యమైంది కాబట్టే విమర్శలు కూడా ఎక్కువగా వస్తున్నాయన్నారు. విద్యుత్ సంస్థలు చాలా వృద్ధి సాధించాయని.. 19 వేల ఉత్పత్తి సామర్థ్యం ఉందని తెలిపారు. 8 వేల మెగావాట్ల సంప్రదాయేతర ఇంధన విద్యుత్ వస్తోంద్నారు. 11 వేల పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ సామర్థ్యం కూడా పెరగనుందన్నారు. కృష్ణపట్నం, విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్‌లో అదనపు సామర్థ్యం అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు. ట్రాన్స్ మిషన్, జనరేషన్ సేవలు ప్రజలకు తెలియకపోవచ్చు కానీ పంపిణీ సంస్థల సేవలు ప్రజలకు నేరుగా తెలుస్తాయన్నారు.