తిరుపతి : కన్నడ పవర్ స్టార్ట్ పునీత్ రాజ్ కుమార్ గారి కుటుంబ సభ్యులను పరామర్శించారు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. బెంగుళూరులో పునీత్ రాజ్ కుమార్ సతీమణి అశ్వినిని కలిసి…వారి కుటుంబాన్ని పరామర్శించారు మంత్రి పెద్దిరెడ్డి.
పునీత్ అకాల మరణం చాలా బాధించిందని ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. చిన్న వయస్సు లో అనేక మంచి కార్యక్రమాలు చేసి ఎంతో మందిని ఆదుకున్న గొప్ప మానవతావాది పునీత్ అని కొనియాడారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆయన లోని లోటు ఎవరూ తీర్చ లేనిదని తెలిపారు.
