అనంతపురం జిల్లా ఎస్పీగా ఫక్కీరప్ప బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఫక్కీరప్ప మాట్లాడుతూ… శాంతి భద్రతల పరిరక్షణకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. మహిళల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదు అన్నారు. మహిళలపై నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. ఒక్కో జిల్లాలో ఒక్కో రకమైన పరిస్థితులు ఉంటాయి అని తెలిపారు. అన్నిటినీ సమన్వయం చేసుకుంటూ జిల్లాలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ గా ఉండేలా చూస్తాను. పాత ఎస్పీ సత్య ఏసుబాబు చేపట్టిన కార్యక్రమాలన్నీ కొనసాగుతాయి అని స్పష్టం చేసారు.
అనంతపురం జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ఫక్కీరప్ప..
