Site icon NTV Telugu

కర్నూలులో ఆన్‌లైన్‌ పెళ్లి…

marriage

కరోనా కారణంగా పెళ్లిళ్లు కుడా ఆన్‌లైన్‌లో చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కర్నూల్‌కు చెందిన రజిత, నల్గొండకు చెందిన దినేశ్‌రెడ్డిల వివాహం కర్నూలు లోని ఓ ఫంక్షన్ హాల్లో ఆన్ లైన్ లో జరిగింది. రజిత, దినేష్‌రెడ్డిలకు రెండేళ్ల క్రితం వివాహం జరిపించాలని ఇరుకుటుంబాల పెద్దలు నిర్ణయించారు. అమ్మాయి, అబ్బాయి ఉద్యోగరీత్యా ఆస్ట్రేలియాలోని డింబోలలో ఉంటున్నారు. కరోనా కారణంగా వీరి వివాహం వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా నుండి ఇండియాకు వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఆన్‌లైన్‌లోనే వివాహం జరిపించేవిధంగా పెద్దలు నిర్ణయించారు. పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె ఆస్ట్రేలియాలో కల్యాణ మండపంలో కూర్చుంటే కర్నూలులో వేద పండితుడు ఫోన్‌ ద్వారా వీరి వివాహం జరిపించారు.

Exit mobile version