Official YouTube channel of the Janasena party has been hacked: సరిగ్గా ఇంకా నెల రోజుల్లో 2024 ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. కేవలం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఉన్న లోక్ సభ ఎన్నికలు కూడా అదే రోజు జరగబోతున్నాయి. విడతల వారీగా జరగబోతున్న ఈ ఎన్నికలకు సంబంధించి ఇప్పుడే దాదాపు అన్ని రాష్ట్రాల లో అధికార ప్రతిపక్షాలు హోరాహోరీ పోరాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అధికార వైసిపి మరోసారి అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుంటే ప్రతిపక్ష టిడిపి పవన్ కళ్యాణ్ జనసేన, బిజెపితో కలిసి కూటమిగా ఏర్పడింది.
Siddarth: ‘యానిమల్’ సినిమా.. మగాళ్లపై సిద్ధార్థ్ సంచలన వ్యాఖ్యలు
అయితే సరిగ్గా ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన అధికార యూట్యూబ్ ఛానల్ ని హ్యాకర్లు హ్యాక్ చేశారు. జనసేన అధికార యూట్యూబ్ ఛానల్ కి 1.4 మిలియన్ సబ్స్క్రైబర్లు ఉండేవారు. అలాంటి ఛానల్ ని హ్యాక్ చేసిన హ్యాకర్లు దాని పేరును మైక్రోస్ట్రాటజీగా మార్చేశారు. అంతేకాదు యూట్యూబ్ బ్యాన్ చేసిన బిట్ కాయిన్ గురించి కొన్ని లైవ్ వీడియోలు కూడా ప్రారంభించారు. ఈ విషయం యూట్యూబ్ దృష్టికి వస్తే చానల్ ని పూర్తిగా బ్యాన్ చేసే అవకాశం ఉంది. అయితే ఈలోపు జనసేన టెక్నికల్ టీం కనుక యూట్యూబ్ సంస్థ దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్తే ఛానల్ ని మళ్ళీ పునరుద్ధరించే అవకాశం కనిపిస్తోంది.
