NTV Telugu Site icon

ఉద్యోగ సంఘాల విజ్ఞప్తుల కోసం నోడల్ అధికారి

పీఆర్సీ అమలు, ఉద్యోగ సంఘాల డిమాండ్లపై ప్రభుత్వం ఈ రోజు ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలతో భేటీ అయ్యింది. ఈ నేపథ్యంలో పీఆర్సీ నివేదిక, ఫిట్‌మెంట్‌, ఉద్యోగ సమస్యల పరిష్కారంపై చర్చించింది. అయితే ఉద్యోగ సంఘాల విజ్ఞప్తుల స్వీకరణ కోసం ప్రభుత్వ నోడల్‌ అధికారిని నియమించింది.

దీనికోసం ఆర్థికశాఖ అదనపు కార్యదర్శిగా ఉన్న ఆదినారాయణను నోడల్‌ అధికారిగా నియమించింది. జాయింట్‌ స్టాఫ్ కౌన్సిల్‌లో నిర్ణయం మేరకు నోడల్‌ అధికారిని నియమించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌ నోడల్‌ అధికారి నియామక ఉత్వర్వులు జారీ చేశారు.