పీఆర్సీ సాధనకు ఉద్యోగులు ఉద్యమం కొనసాగిస్తున్నారు. బుధవారం చేపట్టిన ఛలో విజయవాడను విజయవంతం చేసేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తూనే వున్నారు. పోలీసులు వారిని నియంత్రించే పనిలో వున్నారు. ఈ నెల మూడో తేదీన ఛలో విజయవాడకు పీఆర్సీ సాధన సమితికి అనుమతి నిరాకరిస్తున్నామన్నారు విజయవాడ సీపీ క్రాంతి రాణా టాటా. ఛలో విజయవాడ నిర్వహణ చట్టపరంగా విరుద్దం.ఉద్యోగుల కాండాక్ట్ రూల్స్ ప్రకారం కూడా ఛలో విజయవాడ కార్యక్రమం చేయకూడదు.
కరోనా నిబంధనల కారణంగా ఛలో విడయవాడకు అనుమతి ఇవ్వడం లేదు.ఉద్యోగులు భారీ ఎత్తున వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. ఈ పరిస్థితుల్లో ఛలో విజయవాడకు అనుమతి నిరాకరిస్తున్నాం. భారీ సమూహలు ఉన్నప్పుడు బయట వ్యక్తులు జొరబడే ప్రమాదం ఉందన్నారు విజయవాడ సీపీ.
ఉద్యోగుల ఛలో విజయవాడ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసుల చర్యలు మొదలయ్యాయన్నారు పీఆర్సీ స్టీరింగ్ కమిటీ ప్రతినిధి ఆస్కార్ రావు. వివిధ జిల్లాల్లో ఉద్యోగ సంఘాల నాయకులు ఛలో విజయవాడ కార్యక్రమంలో పాల్గొనకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.నిర్బంధంతో ఉద్యోగుల పోరాటాన్ని ప్రభుత్వం నిలువరించ లేదన్నారు ఆస్కార్ రావు.ఛలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేసి తీరుతాం అన్నారు.