Site icon NTV Telugu

కర్నూలు జంట హత్యల కేసులో 9 మంది అరెస్టు…

కర్నూలు పెసరవాయి జంట హత్య కేసులో 9 మంది నిందితులను అరెస్టు చేసారు. రాజా రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, కేధార్ నాద్ రెడ్డి తో పాటు మరో ఆరుమందిని అరెస్టు చేసి వారిని నంద్యాల కోర్టుకు తరలించారు పోలీసులు. ఈనెల 17న గడివేముల మండలం పెసరవాయిలో హత్యకు గురైన టీడీపీ నేతలు వడ్డు నాగేశ్వర రెడ్డి, వడ్డు ప్రతాప్ రెడ్డిలను రెండు వాహనాలతో ఢీకొట్టి వేటకొడవళ్ళతో నరికి చంపారు నిందితులు. గ్రామంలో అధిపత్యం, కుటుంబాల మద్య పాత కక్షల, సర్పంచ్ ఎన్నికల్లో జరిగిన ఘటనల నేపథ్యంలో వైసీపీ నేతలు హత్య చేసినట్లు తేల్చారు పోలీసులు. హత్యకు ఉపయోగించిన రెండు వాహనాలు, 4 వేటకొడవళ్ళ, 2 పిడిబాకులు, ఆరు సెల్ పోన్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

Exit mobile version